నస్పూర్, జూన్ 10 : జిల్లాలో మిషన్ భగీరథకు సంబంధించి ఇంటింటి నల్లా కనెక్షన్ల సర్వే ప్రక్రియ పది రోజు ల్లో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రాహుల్ సూ చించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మి షన్ భగీరథ ఈఈ వెంకటేశ్వర్లుతో కలిసి అధికారులకు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సర్వే ను మొబైల్ యాప్ ద్వారా పది రోజుల్లో పూర్తి చేయాలన్నారు.
నల్లా కనెక్షన్లు కలిగిన నివాసాలు, ఇంకా ఇవ్వాల్సిన కనెక్షన్లు, ఇతర వివరాలతో కూడిన సమాచారాన్ని యాప్లో నమోదు చేయాలన్నారు. ఇంటింటికీ వె ళ్లి యజమానితో పాటు కుటుంబ సభ్యులు ఆధార్ నం బర్లు, కులం, ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు, నీటి సరఫరాకు సంబంధించి ఫొటోలను యాప్లో పొందుపర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, అదనపు పంచాయతీ అధికారి దత్తరావు, డివిజనల్ పంచాయతీ అధికారులు, ట్రైనింగ్ రీసోర్స్ పర్సన్లు మల్లేశ్, రాజేందర్, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్తో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంచిర్యాల, మందమర్రి, నెన్నెల, భీమిని, చెన్నూరు, ఆరేగూడ తదితర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి దరఖాస్తులు అందజేశారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కారిస్తామన్నారు.