ఆసిఫాబాద్ టౌన్, ఫిబ్రవరి 2 : పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. శుక్రవారం జిల్లాలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల వార్డెన్లు, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మార్చి 18 నుంచి 29వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని తెలిపారు.
నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారి సజీవన్, అధికారులు పాల్గొన్నారు.