కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని పలు గ్రామాల్లోని ఎరువుల షాపులను ( Fertilizers Shops ) శనివారం టాస్క్ ఫోర్స్ అధికారులు ( Task Force ) తనిఖీ చేశారు. టాస్క్ ఫోర్స్ కమిటీ అధికారులు ఏవో చల్ల ప్రభాకర్, ఎస్సై ఆంజనేయులు, దేవాపూర్ ఎస్సై గంగారాం, తదితరులు ముత్యంపల్లి, కాసిపేట, కోమటిచేను, దేవాపూర్ గ్రామాల్లోని ఎరువుల షాపులను తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్, రసీదులను తనిఖీ చేశారు. స్టాక్ బోర్డ్ ఏర్పాటు చేసి స్టాక్ వివరాలు, ధరల వివరాలు పెట్టాలని సూచించారు. అధిక ధరలు అమ్మవద్దని, ఎరువులను బ్లాక్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.