జైనూర్ : వైద్యాధికారులు ,ఉద్యోగులు వైద్యసేవల (Medical services ) పట్ల నిర్లక్ష్యం చేయవద్దని కొమురం భీం జిల్లా ఆరోగ్య అధికారి సీతారాం (District Medical Officer Sitaram ) కోరారు. బుధవారం జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాల్లో పర్యటించి ప్రభుత్వ ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు.
మండలంలో వ్యాధుల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రుల్లో ఏమైనా మందుల కొరత ఉందా అని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీపీఎంశ్యామలాల్, కార్యాలయ సూపరింటెండెంట్ షఫీద్దీన్, సీహెచ్వో సంపత్, హెచ్ఈవో రవిదాస్, జై నూర్ వైద్యాధికారి నాగర్ గోజే అశోక్, వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.