మంచిర్యాల అర్బన్ : మంచిర్యాల జిల్లాలో ఏసీబీకి ( ACB ) మరో అవినీతి చేప చిక్కింది . ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు ( DSP Madhu ) తెలిపిన వివరాల ప్రకారం .. కోటపల్లి మండలం అంగరాజుపల్లి పీహెచ్సీలో ఇన్చార్జి జూనియర్ అసిస్టెంట్‌గా( Junior Assistance ) విధులు నిర్వహిస్తున్న గడియారం శ్రీనివాస్ అనే వ్యక్తి అదే శాఖలో పని చేస్తున్న వ్యక్తి కి సంబంధించిన డీఏ ( DA ) నిధుల విడుదల గురించి రూ.6 వేలను లంచంగా డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
బాధితుడి పిర్యాదు మేరకు మంచిర్యాల పట్టణంలో బొమ్మరిల్లు హోటల్ వద్ద రూ.6 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు వెల్లడించారు. ఎవరైనా ప్రభుత్వ శాఖలో పని చేస్తున్న అధికారులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు లేదా వాట్సప్ నంబర్ 9440446106 సమాచారం అందించాలన్నారు.