లంచం అడిగి.. అడ్డంగా దొరికి..
మంచిర్యాల జిల్లా వైద్యారోగ్యశాఖ సిబ్బంది లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. బెల్లంపల్లికి చెందిన డీ రామసాగర్ తన సోదరికి చెందిన ఎర్టీగా కారును మంచిర్యాల డిప్యూటీ డీఎంహెచ్వో కార్యాలయంలో ఏడాది పాటు అద్దె ప్రతిపాదికన నడిపిచేందుకు ఒప్పందం చేసుకున్నాడు.
- అద్దెకారు బిల్లుల చెల్లింపునకు రూ.10 వేల డిమాండ్
- ఏసీబీని కలిసిన బెల్లంపల్లికి చెందిన రామసాగర్
- డిప్యూటీ డీఎంహెచ్వో కార్యాలయంపై దాడి
- ముగ్గురు సిబ్బందిని పట్టుకున్న అధికారులు
మంచిర్యాల ఏసీసీ, జూన్ 13 : మంచిర్యాల జిల్లా వైద్యారోగ్యశాఖ సిబ్బంది లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. బెల్లంపల్లికి చెందిన డీ రామసాగర్ తన సోదరికి చెందిన ఎర్టీగా కారును మంచిర్యాల డిప్యూటీ డీఎంహెచ్వో కార్యాలయంలో ఏడాది పాటు అద్దె ప్రతిపాదికన నడిపిచేందుకు ఒప్పందం చేసుకున్నాడు. దీంతో ఆరు నెలల బిల్లు (రూ.1.96 వేలు) చెల్లించాలని అధికారులను కోరగా అధికారులు జాప్యం చేస్తూ వచ్చారు. రూ. 10 వేలు ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తామని చెప్పా రు. దీంతో రామసాగర్ ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పాడు. వారి సూచన మేరకు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారులు రామసాగర్ను డబ్బులతో కార్యాలయానికి పంపించారు. అనంతరం ఏసీబీ అధికారులు దాడి చేసి లంచం తీసుకుంటున్న ఔట్ సోర్సింగ్ సీనియర్ అకౌంటెంట్ సిరికొండ దీపిక, సహకరించిన మరో సీనియర్ అకౌంటెంట్ పులి రాజనర్సయ్యను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అనంతరం ఏసీబీ డీఎస్పీ భద్రయ్య మీడియాకు వివరాలు వెల్లడించారు. కారు యజమాని అద్దె బిల్లు చెల్లించాలని గతంలో ఇక్కడ పని చేసిన కార్యాలయ సీనియర్ అసిస్టెంట్, ప్రస్తుతం రామగుండం ప్రభుత్వ వైద్య కళాశాల సూపరింటెండెంట్ షఫీయుద్దీన్ను సంప్రదించింది. దీంతో అతను రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బదిలీపై వెళ్లిన తర్వాత బిల్లు క్లియర్ అయ్యింది. దీపిక మళ్లీ కారు యజమానికి ఫోన్ చేసి కార్యాలయానికి రావాలని సూచించింది. దీంతో ఆమె అక్కడికి వెళ్లగా షషీయుద్దీన్ సార్ డబ్బులు తనకు ఇవ్వమన్నాడని దీపిక చెప్పింది. దీపిక మరో పనిలో బిజీగా ఉండగా, అక్కడే విధులు నిర్వహిస్తున్న రాజనర్సయ్యను డబ్బు లు తీసుకోవాలని కోరారు. ఆ డబ్బులను తీసుకొని అక్కడే రోడ్డుపై ఉన్న షఫీయొద్దీన్కు తీసుకెళ్లి ఇచ్చాడు. తమ సిబ్బందితో కలిసి దాడి చేసి షఫీయుద్దీన్, అకౌంటెంట్ దీపిక, సహకరించిన రాజనర్సయ్యను పట్టుకున్నామని వివరించారు. వారిని ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

