ఎదులాపురం, జూలై 3 : తెలంగాణ రాష్ర్టానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటుగా భావిస్తున్నామని ఏబీవీపీ ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ అక్షయ్ అన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్స్‌ను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టా రు. కలెక్టర్ చౌరస్తా నుంచి విద్యార్థులు ప్లకార్డులతో ర్యాలీగా వచ్చి కలెక్టరేట్‌ను ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కలెక్టరేట్ గేట్‌ను తోసి గేటును ఎక్కే ప్రయత్నం చేశా రు.
ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్ మాట్లాడు తూ.. విద్యారంగంలో నెలకున్న సమస్యలను పరిష్కరించాలని డి మాండ్ చేశారు. విద్యాశాఖకు మంత్రిని కూడా నియమించకుండా ప్రభుత్వం ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్పిప్స్ను వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షం లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తూ త్వరలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. మహేశ్, నిఖిల్, విఘ్నేశ్, కార్తీక్, ఉదయ్, శివసాయి, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బుధవారం ఆందోళనలు కొనసాగాయి. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్స్‌ను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం ఆదిలాబాద్, నిర్మల్ల ఎదుట ఆందోళన నిర్వహించారు. దివ్యాంగులకు కేంద్రం రూ.3 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.6 వేల పింఛన్ ఇవ్వాలని ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో పని చేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్‌కు కనీస వేతనం రూ.26 వేలు పెంచాలని డిమాం డ్ చేస్తూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిర్మల్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పెంబి పీహెచ్సీలో అవ్వాల్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని వేణునగర్ గ్రామానికి చెందిన ఆదివాసులు పీహెచ్సీ ఎదుట నిరసన తెలిపారు.