తాండూర్ : తాండూర్ మండల కేంద్రానికి చెందిన అభినవ కల్చరల్ సోషల్, స్పోర్ట్స్ ,ఎడ్యుకేషనల్ అండ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేశెట్టి సంతోష్ కుమార్ ( Santosh Kumar ) అంతర్జాతీయ స్థాయిలో గౌరవ డాక్టరేట్ (Doctorate) ప్రతిభ పురష్కారాన్ని అందుకున్నారు.
శనివారం పుదుచ్చేరిలోని కంబన్ కలైరంగం ఆడిటోరియంలో యునైటెడ్ అమెరికన్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో డైరెక్టర్, తమిళనాడు మాజీ న్యాయమూర్తి డాక్టర్ కే వెంకటేశన్ అధ్యక్షతన ‘సామాజిక నాయకులు, దార్శనికుల సమ్మేళనం -2026’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇందులో భాగంగా సంతోష్ కుమార్ 30 సంవత్సరాలుగా రక్తదాన శిబిరాలు, పేదలకు సహాయం, విద్యార్థులకు ప్రోత్సాహం, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, యువతలో సేవా స్ఫూర్తిని పెంపొందించడం వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించినందుకు డాక్టరేట్ ప్రదానం చేశారు. సంతోష్ కు గౌరవ డాక్టరేట్ లభించడం పట్ల ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.