కౌటాల, డిసెంబర్ 10 : సిర్పూర్(టీ) మండలంలో హుడ్కిలి గ్రామంలో పులి.. కౌటల మండలంలోని తలోడి గ్రామంలో హైనా సం చరిస్తూ పశువులపై దాడులు చేస్తూ గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. సి ర్పూర్(టీ) మండలం హుడ్కిలి గ్రామంలో మంగళవారం తెల్లవారు జామున దంద్రె రా వూజీ ఇంటి ముందు కట్టేసిన లేగదూడపై పు లి దాడి చేసి చంపేసింది. ఘటన స్థలంలో పు లి అడుగులను అటవీ అధికారులు గుర్తించారు. కౌటాల మండలంలోని తలోడి లో మంగళవారం కొడిపే విమల తన రెండు మేకలను తీసుకుని చేనుకు వెళ్లింది. ఓ చోట మేకలను కట్టేసి చేనులో పని చేసేందుకు వెళ్లింది.
కొద్దిసేపటికి మేకలు ఒక్కసారిగా అరవడం తో వెళ్లి చూడగా మేకపై మెడపై తీవ్రగాయమై ఉండడంతో పులి దాడి చేసేందేమోనని భ యంతో విమల సొమ్మసిలి పడిపోయింది. కా సేపటి తర్వాత లేచి చూడగా మేక బావిలో ప డి ఉంది. ఆమె అరుపులు విని చుట్టు పక్కల వారు వచ్చి మేకను బయటకు తీసి చూడగా అప్పటికే మేక మృతి చెందింది. పులి దాడి చే సిందనే భయంతో విమలతో పాటు చుట్టు ప క్కల వారు ఇండ్లకు పరుగులు తీశారు. విష యం తెలుసుకున్న కాగజ్నగర్ ఎఫ్డీవో సా హు, సిర్పూర్ రేంజర్ ఇక్బాల్ హుస్సేన్ సి బ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నా రు. దాడి చేసింది పులి కాదని హైనా అని నిర్ధారించారు. హైనాల సంచారం ఉన్నందున మే కలు, గొర్రెలు, చిన్నపిల్లలను చేలకు, అటవీ స మీపంలోకి తీసుకెళ్లవద్దని సూచించారు. ఆ యన వెంట రవీంద్రనగర్ డిప్యూటీ ఎఫ్ఆర్వో హైమావతి, ఎఫ్బీవో ప్రభాకర్ ఉన్నారు.