భీంపూర్, ఫిబ్రవరి 3 : ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని రాష్ట్ర సరిహద్దు పెన్‌గంగా సమీప గొల్లగఢ్ శివారు ప్రాంతంలో ఆవుదూడను పెద్దపులి చంపేసింది. పిప్పల్‌కోటి గ్రామానికి చెందిన రైతు విఠల్ తమ చేను వద్ద కొట్టంలో సోమవారం రాత్రి కూడా ఎప్పటిలాగే పశువులను ఉంచాడు.
మంగళవారం ఉదయం వచ్చి చూసేసరికి కమలాయికుంట వద్ద ఒక ఆవుదూడ మృత్యువాత పడి ఉన్నది. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇ వ్వడంతో.. ఎఫ్‌బీవో అహ్మద్‌ఖాన్, సి బ్బంది ఘటన స్థలానికి వచ్చి పరిశీలిం చి పెద్దపులి దాడిగా ధ్రువీకరించారు.