చెన్నూర్ టౌన్ : మంచిర్యాల చెన్నూర్ పట్టణానికి (Chennur town ) చెందిన ఏల్పుల పోచం (Elpula Pocham) ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సులో ( India Book of Records ) చోటు సంపాదించుకొని చరిత్ర సృష్టించాడు. చెన్నూరుకు చెందిన పోచం కశ్మీర్ టు కన్యకుమారి వరకు లైవ్ డ్రాయింగ్ (Live Drawing) పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. చిత్రకళ ద్వారా ప్రాచీన వారసత్వ సంపదను , ప్రకృతి అందాలను తన చిత్రకళ ద్వారా లైవ్‌లో అధ్యయనం చేసి తనకంటూ ఒక చరిత్ర సృష్టించాడు.
చిత్రకారుడిగా అరుదైన చరిత్ర సృష్టించిన పోచం కష్టాన్ని గుర్తించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ శనివారం హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో జరిగిన ఇండియా బుక్ ఆఫీస్ లో అవార్డును అందుకున్నారు. ఆవార్డు రావడం పట్ల తన గురువైన మద్దూరి రాజు యాదవ్, సత్యనారాయణ, మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులకు పోచం కృతజ్ఞతలు తెలిపారు.