మంచిర్యాల అర్బన్ : చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు ( Chilukur priest ) రంగరాజన్ పై దాడి చేసిన వీర రాఘవరెడ్డి పై పీడీ యాక్ట్ (PD Act) పెట్టాలని హిందూ సంఘాల నాయకులు కర్ణకంటి రవీందర్ డిమాండ్ చేశారు. బుధవారం మంచిర్యాల లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ హిందూ సమాజం జాగృతం చేయడం కోసం అర్చకులు రంగరాజన్ ఎంతో మందిని చైతన్యం చేశారని పేర్కొన్నారు.
మాదిగలకు ఆలయ ప్రవేశం కోసం ఒక మాదిగ సమాజం సంబంధించిన వ్యక్తిని తన భుజాలపై ఎత్తుకొని ఆలయ ప్రవేశం చేపించిన మహోన్నతమైన వ్యక్తి అర్చకులు రంగరాజన్ అని తెలిపారు. రామరాజ్యం అనే పేరుతో దాడి చేసిన వీర రాఘవ రెడ్డి ని వెంటనే శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమం లో అర్చకులు సంతోష్ సంగర్కర్ శర్మ, రమేష్ శర్మ, సంతోష్, శ్రీనివాస్, ప్రవీణ్, రవీంద్ర చారీ, అనిల్, హిందూ బంధువులు పాల్గొన్నారు.