మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కోసం ఇటీవలే రూ.లక్ష ఖర్చుపెట్టి కొత్త బాత్రూమ్ నిర్మించారు. కౌన్సిల్ హాల్, మేయర్, డిప్యూటీ మేయర్ ర్ల రెనోవేషన్ కోసమని లక్ష రూపాయలు ఖర్చుపెట్టారు. ఇంత చేసిన అధికారులు మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ ఆఫీస్‌కు నిత్యం వివిధ పనుల కోసం వచ్చే జనాలు ఉపయోగించే బాత్రూమ్లను మాత్రం ఏ మాత్రం పట్టించుకోలేదు. కౌన్సిల్ హాల్‌కు వెళ్లే మెట్ల పక్కనున్న టాయిలెట్‌కు లోపలివైపు గొల్లెం లేక.. తాడునే గొల్లెంలా వాడుతున్నారు.
ఇటీవల రూ.లక్ష పెట్టి కమిషనర్‌కు కొత్త బాత్రూమ్ నిర్మించిన అధికారులు.. నిత్యం వందల మంది ఉపయోగించే బాత్రూమ్లో కనీస సదుపాయాలు కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిత్యం వందల మంది మున్సిపల్ సిబ్బందితోపాటు కార్యాలయానికి వచ్చే జనాలకు కేవలం మూడు బాత్రూమ్లే ఉన్నాయని, అవి కూడా కనీస వసతులకు దూరంగా ఉండడంతో ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని మున్సిపల్ సిబ్బందే చెప్తున్నారు. పాత బాత్రూమ్లను రిపేర్ చేయడంతోపాటు కొత్తగా మరిన్ని బాత్రూమ్లను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.
– మంచిర్యాల, స్టాఫ్ ఫొటోగ్రాఫర్.