పెంబి, నవంబర్ 13 : నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని తాడిగూడ అడవుల్లో పెద్ద పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నది. గురువారం తాటిగూడ సెక్షన్ పరిధిలోని జిడిమాల్య గ్రామ శివారులో పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్వో రమేశ్రావు మాట్లాడుతూ.. పొలాలకు వెళ్లేటప్పుడు, పత్తి ఏరేటప్పుడు గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. పశువుల కాపరులు, ఇతరులు అడవుల్లోకి ఎవరు వెళ్లొద్దని సూచించారు. పులి అలజడి కనిపిస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.
ఎదులాపురం, నవంబర్ 13 ః ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ, బేల, భీంపూర్, బోథ్, జైనథ్ మండలాల్లోని ప్ర భుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, కిచె న్ షెడ్, ప్రహరీ వంటి మౌలిక సదుపాయాల కల్పన, పనుల పురోగతిపై గురువారం జడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు సూచనలు చేశారు. సమావేశంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ పాల్గొన్నారు.