ఎదులాపురం(జైనథ్)జనవరి8: పుష్యమాసా న్ని పురస్కరించుకొని జైనథ్ మండలం పూసా యి ఎల్లమ్మ జాతరకు ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయాన్నే చేరుకున్నారు. కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, జలాన్ని వెం ట తీసుకెళ్లారు. మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వనభోజనాలు చేసి ఆనంతరంగా గడిపారు. ఆలయం చుట్టూ గుడారాలు వేసుకొని విడిది చేశారు. భక్తుల కోసం గ్రామస్తులు ప్రత్యేకంగా నీటి సౌకర్యం కల్పించారు. జైనథ్ పోలీసులు ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
కెరమెరి మండలం మహరాజ్గూడ అట వీ ప్రాంతంలో కొనసాగుతున్న జాతరకు ఆదివారం తెలంగాణ, మహారాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ప్రాంగణం కిటకిట లా డింది. రాష్ట్ర ప్రభుత్వం జంగుబాయి జాతర వేడుక లకు ఏటా రూ. 10లక్షలు కేయించడంతో పాటు జాతరకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి భక్తులు నిత్యం పెద్ద సంఖ్యలో వస్తుండడంతో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. రాత్రి పూట ఇబ్బం దులు ఎదురవకుండా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయడంతో ఆదివాసీ వేడుకలు వైభవంగా సాగుతు న్నాయి. ఇరు రాష్ర్టాల భక్తుల డోలు, సన్నాయి తుడుం వంటి సంప్రదాయ వాయిద్యాలతో అటవీ ప్రాంతం మార్మోగుతున్నది. భక్తులకు సర్కారు రవాణ సౌకర్యం కల్పించడంతో నిత్యం వేల సంఖ్యలో తరలివస్తు న్నారు. ముందుగా టొప్లకస వద్ద పూజలు చేసి పుణ్య స్నానాలు చేసిన అనంతరం పవిత్ర జలంతో ఆలయ ప్రాంగణానికి తరలివచ్చారు. ఆ జలంతో అక్కడే నైవేద్యాలు తయారు చేసి అమ్మవారికి సమర్పించారు. పోచమ్మ, రావుడ్క్పేన్, మైసమ్మ వద్ద మేకలు, కోళ్లను బలిచ్చి మొక్కులు చెల్లించారు. రాత్రంతా పాటలు, నృత్యాలు చేస్తూ ఆదివాసీలు సంబరాలు చేసుకుంటున్నారు. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో 8గోత్రాల కటోడాలకు తోచిన కానుకలు సమర్పించి మర్యాదపూర్వకంగా ఆలింగనం చేస్తూ కలిసి వీడ్కోలు పలికారు.