దహెగాం, మార్చి 28 : ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడి, ఆ ప్రభావం అన్ని వర్గాలపైనా పడుతు న్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయం, కల్వా డలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో గ్యాస్ అయిపోవడంతో కట్టెలపొయ్యిపైనే వంటలు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. శనివారం ఆయాచోట్ల పాత తలుపుల ముక్కలు, ఆవరణల్లో దొరికిన కట్టెలతో వంట చేసి విద్యార్థులకు పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం పరీక్షలు కొనసాగుతుండగా, విద్యార్థులకు సమయానికి భోజనం అందించడం కష్టంగా మారుతున్నది.