సీసీసీ నస్పూర్, జనవరి 21: తప్పుడు కేసులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. మంగళవారం నస్పూర్-శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నస్పూర్ బీఆర్ఎస్ యూత్ విభాగంలో చురుకుగా పనిచేస్తున్న కందుల ప్రశాంత్‌పై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు తరలించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తీగల్‌పహాడ్ ఏఎస్ఆర్ఆర్ నగర్‌కు చెందిన తాళ్లపల్లి శ్రావణి ఓ ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగం వచ్చిందని, ఈ కంపెనీలో ఆమె ఫేక్ డాక్యుమెంట్లు పెట్టిందని ఉద్యోగం ఇవ్వకుండా ఆపారని, దీనికి కారణం దుర్గం వెంకటేశ్వర్లు అని ఆమె కందుల ప్రశాంత్‌కు తెలిపింది.
శ్రావణి, ఆమె తల్లి, కందుల ప్రశాంత్ ముగ్గురు కలిసి వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి అడిగారని తెలిపారు. అతని వద్ద ఉన్న ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ తీసుకుని పరిశీలించగా వెంకటేశ్వర్లు ఇదంతా చేశాడని పోలీస్‌లకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ యూత్ నాయకుడు కందుల ప్రశాంత్ కులం పేరుతో దూషించాడని కాంగ్రెస్ నాయకులు దుర్గం వెంకటేశ్వర్లు చేత తప్పుడు అట్రాసిటీ కేసు పెట్టించారని ఆరోపించారు. ఇదంతా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరిగిందని, పోలీసులు అర్ధరాత్రి విచారణ చేపట్టడం వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని ఆరోపించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ తప్పుడు కేసులు పెడితే న్యాయస్థానంలో భంగపాటు తప్పదన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోలీస్ పాలన నడిపిస్తున్నారని, కేసులకు భయపడేదిలేదన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాడులు, బెదిరింపులు, సెటిల్మెంట్ల వ్యవహారాలకు సంబంధించిన చిట్టా మొత్తం తన వద్ద ఉందని, సమయం వచ్చినప్పుడు బయటపెడతానని చెప్పారు. అనంతరం కందుల ప్రశాంత్ భార్య అనూష మాట్లాడుతూ తన భర్తను అన్యాయంగా కేసులో ఇరికించారని, ఏ తప్పు చేయని తన భర్తను జైలు నుంచి విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్‌రావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మెరుగు పవన్‌కుమార్, నాయకులు వంగ తిరుపతి, గోగుల రవీందర్‌రెడ్డి, పానుగంటి సత్తయ్య, హైమద్, పెరుమాళ్ల జనార్దన్, అకునూరి సంపత్‌కుమార్, అడ్లకొండ రవిగౌడ్, ముక్కెర వెంకటేశ్, బాకం నగేశ్, తిప్పని తిరుపతి, ఎండీ రఫీక్‌ఖాన్, జాడి భానుచందర్, తదితరులు పాల్గొన్నారు.