మంచిర్యాల, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతి నిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులల సంచా రం అలజడి సృష్టిస్తున్నది. కొన్ని రోజులుగా మంచిర్యా ల, నిర్మల్ జిల్లాల్లోని అటవీప్రాంత పల్లెల్లో నిత్యం ఎక్క డో చోట పశువులపై దాడులు చేస్తుండగా, ప్రజానీకం భయాందోళనలకు గురవుతున్నది. ఇక రాత్రి.. తెల్లవారు జామున వ్యవసాయ పనుల కోసం వెళ్లే రైతులైతే ఎప్పుడు ఏ వైపు నుంచి వచ్చి పులి దాడి చేస్తుందోనని గజగజ వణికిపోతున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే పులులు కొంతకాలం ఇక్కడే ఉండే అవకాశాలున్న నేపథ్యంలో అటవీ అధికారులు అప్రమ త్తమవ్వడమే గాక.. వాటి సంరక్షణపై దృష్టి పెట్టారు. వా టిని నిత్యం ట్రాక్ చేస్తున్నారు. అటవీ సమీప గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తూ అలర్ట్ చేస్తున్నారు.
పక్షం రోజులుగా నిర్మల్‌లో ఒకటి.. రెండు నెలలుగా కవ్వాల్‌లో మరొకటి..
మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి నిర్మల్ జిల్లా సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోకి ప్రవేశించిన పెద్దపులి గత పక్షం రోజులుగా ఇక్కడే మకాం వేసింది. కుభీర్ మండలం నుంచి కడెం వరకు సుమారు 200 కిలోమీటర్ల పొడవున ఉన్న సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని అడవుల్లో స్వేచ్ఛగా తిరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి, తలమడుగు అడవుల నుంచి ఈ పులి నిర్మల్ జిల్లాలోని అడవుల్లో ప్రవేశించి ఉండొచ్చని భావిస్తున్నారు. తెలంగాణ కశ్మీర్‌గా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతం పెద్దపెద్ద చెరువులు, కుంటలు, జలాశయాలకు ప్రసిద్ధి. వన్యప్రాణుల నివాసానికి మన జిల్లా అడవులు ఎంతో అనువైనవి కావడంతో.. పెద్దపులి సైతం ఇక్కడి సహ్యాద్రి పర్వతాల్లో మకాం వేసినట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లాలోని సారంగాపూర్, కుంటాల, కుభీర్, నర్సాపూర్(జీ), దిలావర్పూర్, పెంబీ తదితర మండలాల్లోని అటవీ సరిహద్దు ప్రాంతాల్లో పెద్దపులి తిరుగుతున్నది. నిర్మల్ జిల్లాతో పాటు కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో దాదాపు రెండు నెలులుగా మరో పులి ట్రాక్ అవుతూ వస్తున్నది.
జన్నారం, లక్షెట్టిపేట, మంచిర్యాల, బెల్లంపల్లి రేంజ్‌లతో పాటు ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ రేంజ్ అడవుల్లో ఇది తిరుగుతున్నట్లు ఫారెస్టు అధికారులు చెబుతున్నారు. ఇది బయటి నుంచి వచ్చి ఉండకపోవచ్చని, ఎప్పటి నుంచో మన జిల్లాలోనే ఉంటున్న పులి అని విశ్వసనీయంగా తెలిసింది. సాధారణంగా ఇది పులులు బయటికి వచ్చే సమయం కావడంతో అడవులు మొత్తం సంచరిస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. కొంత కాలంగా మంచిర్యాల జిల్లా హాజీపూర్, కాసిపేట మండలాల్లో ఈ పులి సంచరిస్తున్నది. ప్రస్తుతం కొన్ని రోజులుగా ర్యాలీగఢ్‌పూర్ దట్టమైన అడవుల్లో ఈ పులి మకాం వేసింది.
Adilabad6
వరుస దాడులు.. భయాందోళనలో ప్రజలు
పులి సంచారంతో అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న పంట చేలల్లోకి వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. రా త్రి వేళల్లో అటవీ మార్గంలో వెళ్లేందుకు సైతం జంకు తున్నారు. పులి గ్రామ శివారులోకి వచ్చిందని తెలిస్తే చా లు రెండు,మూడు రోజులు బయటికి రావడం లేదు. దీంతో వ్యవసాయ పనులకు, పాడి పశువులకు ఇబ్బం దులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు రైతులకు, జనాలకు ముందస్తు సమాచారం ఇస్తున్నారు. పులి ఈ రోజు ఎక్కడ ఉంది.. ఏ వైపునకు వెళ్తుంద అని నిత్యం ట్రాక్ చేస్తూ.. జనాలను అలర్ట్ చేస్తున్నారు.
ఇటీవల జరిగిన ఘటనలు
ఇది పులులు బయటికి వచ్చే సమయం
సాధారణంగా ఇది పులులు బయటికి వచ్చే సమయం. కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో పులులు తిరగడం అనేది సహజమైన విషయం. కాకపోతే జనవాసాల్లోకి రావడం, పశువులపై దాడి చేయడం వంటి ఘటనల నేపథ్యంలో అటవీ ప్రాంత ప్రజలను అలర్ట్ చేస్తున్నాం. వారికి అవగాహన కల్పిస్తున్నాం. మా ప్రత్యేక టీమ్‌ల ద్వారా పులి సంచరించే సమాచారాన్ని ఎప్పుటికప్పుడు సేకరిస్తున్నాం. పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం.
– శివ్ఆశీష్ సింగ్, జిల్లా అటవీ శాఖ అధికారి, మంచిర్యాల