ఖానాపూర్ రూరల్, జూన్ 27 : ఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్రూం ఇండ్ల లక్కీడ్రా నిర్వహించారు. ఈ డ్రా పారదర్శకంగా నిర్వహించినట్లు డబుల్ బెడ్ రూం ఇండ్ల నోడల్ అధికారి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ము న్సిపాలిటీలో 400 డబుల్ బెడ్రూం ఇండ్లు ని ర్మించారు. 12 వార్డుల్లో అర్హుల నుంచి దరఖాస్తు లు తీసుకున్నారు. 400 డబుల్ బెడ్రూం ఇండ్లకు 708 దరఖాస్తులు వచ్చాయి. అధికారులు మొద టి విడుతలో 400 మంది అర్హులను ఎంపిక చేశా రు. ఆయా వార్డుల పట్టణవాసులు అందోళన చేపట్టడంతో మళ్లీ అధికారులు పునః పరిశీలన చేశా రు. మొదటివిడుతలో ఎంపిక చేసిన 74 మందిని తొలగించారు. వారి స్థానంలో మరో 74 మంది అర్హులను రెండో విడుతలో లక్కీడీప్ ద్వారా ఎం పిక చేశారు. ఇందులో ఎంపికైన వారికి అధికారు లు పత్రాలను అందజేశారు. రెండో విడుతలో పంపిణీ చేసిన డబుల్ బెడ్రూం ఇండ్ల వివరాలను అధికారులు వెల్లడించారు. ఒకటో వార్డు 0, రెం డో వార్డు 1, మూడో వార్డు 5, నాల్గో వార్డు 1, ఐదో వార్డు 7, ఆరో వార్డు 9, ఏడో వార్డు 5, ఎనిమిదో వార్డు 9, తొమ్మిదో వార్డు 2, పదో వార్డు 12, 11వ వార్డు16, 12వ వార్డులో ఏడుగురికి డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించారు. కాగా, డబుల్ బెడ్ రూం ఇండ్ల లక్కీడ్రాలో భాగం గా పొలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశా రు. ఈ కార్యక్రమాన్ని డీఎస్పీ జీవన్ రెడ్డి పర్యవేక్షించారు. ఆర్డీవో స్రవంతి, కమిషనర్ మనోహర్, తహసీల్దార్ రాజమోహన్, డిప్యూటీ తహసీల్దార్ మంజుల, రవీందర్, ఎస్ఐలు శంకర్, రజినీకాంత్, కోసన రాజు పాల్గొన్నారు.
నా కల నెరవేరింది..
నా పేరు మహారాజ్ గంగవ్వ. ఖానాపూర్ మున్సిపాలిటీలోని తొమ్మిదో వార్డులో అద్దె గదిలో ఉంటా. నా భర్త రెండేండ్ల క్రితం చనిపోయాడు. నాకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. వారితో ఇదే వార్డులో కిరాయికి ఉంటూ జీవనాన్ని సాగిస్తున్నా. ముగ్గురు కూతుళ్లకు కష్టపడి పెండ్లి చేశా. ఊళ్లో అడుగు మందం జాగా కూడా కొనలేని పరిస్థితి నాది. 15 ఏండ్ల నుంచి ఇల్లు కిరాయి రూ.500 నుంచి రూ.2500 వరకు కట్టి దుర్భర జీవితాన్ని గడుపుతున్నా. ఇప్పుడు నాకు ఆ కష్టాలు లేకుండా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇంటిని అందించాడు. నేను కన్న కలలను నెరవేర్చాడు. పేద కుటుంబంలో ఉన్న నా పిల్లలను కాపాడి ఓ ఇంటి వారిని చేశాడు. నాకు ఆసరాగా నిలిచాడు. చాలా ఆనందం ఉంది. ఈ ఆనందాన్ని నా పిల్లలతో కేసీఆర్ ఇచ్చిన కొత్త ఇంట్లో గడుపుతా. కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ వస్తే నాలాంటి పేదలకు మంచి జరుగుతది.