నస్పూర్, జూలై 27 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయం గ్రామీణప్రాంత విద్యార్థులకు వరంగా మారుతున్నది. 2025-26 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 80 సీట్లు భర్తీ చేయనుండగా, ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నది. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 16తో ముగియనున్నది.
వచ్చే జనవరి 18న ఆన్లైన్లో పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులు 2013 మే 1 నుంచి 2015 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి. రూరల్ విద్యార్థులకు 75 శాతం రిజర్వేషన్ ఉంది. 1/3 శాతం సీట్లు బాలికలకు కేటాయిస్తారు.