ఎదులాపురం, అక్టోబర్ 31: దేశ సమగ్రత, ఐక్యత కోసం కృషి చేసిన మాజీ ఉప ప్రధాన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శనీయుడని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని జిల్లా పరిషత్ హాలులో సర్దార్ వల్లభాయ్ 150వ జయంతి, జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురసరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నషాముక్త్ భారత్, అంగన్వాడీ పోషణమాసం కార్యక్రమాల్లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా స్థాయి పోషణమాసం కార్యక్రమంలో భాగంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు.
నర్సింగ్ కళాశాల విద్యార్థినులు చేతులు శుభ్రంగా కడుకోవడంపై నాటిక రూపంలో వివరించారు. విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. రక్తహీనతపై అవగాహనలో భాగంగా ఆయా అంగన్వాడీ కేంద్రాల టీచర్లు చిన్నారులతో నృత్యాలు చేయించారు. అనంతరం ఫుడ్మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ సలోని చబ్ర, డీవైఎస్ శ్రీనివాస్, డీఎండబ్ల్యూ కలీం అహ్మద్, డీడబ్ల్యూవో కే.మిలా, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీసీపీవో రాజేంద్రప్రసాద్, పోషణ్ అభియాన్ జిల్లా కో ఆర్డినేటర్ ఆశ్వర్ అబ్దుల్, వయోవృద్ధుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు దేవిదాస్ దేశ్‌పాండే, జిల్లా మలేరియా అధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురసరించుకొని జిల్లా పోలీసు ఆధ్వర్యంలో 5కే యునిటీ రన్‌ను ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ సలోని చబ్రతో కలిసి ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సురేందర్‌రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్.జీవన్ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్, డీవైఎస్వో జకుల శ్రీనివాస్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
నిర్మల్ చైన్‌గేట్, అక్టోబర్ 31: దేశ సమైక్యత, సోదరాభావంపై ప్రతి భారతీయుడూ కట్టుబడి ఉండాలని నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జానకీషర్మిల అన్నారు. సర్దార్ వల్లభాయ్‌పటేల్ జయంతి ఏక్తాదివస్ సందర్భంగా నిర్మల్‌లో శుక్రవారం ఎస్పీ జెండా ఊపి 2కే రన్ ప్రారంభించారు. నిర్మల్ రూరల్ పోలీస్‌స్టేషన్ నుంచి ప్రారంభమైన 2కే రన్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాజేశ్‌మీనా, ఇన్స్పెక్టర్లు, ఆరైలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు పోలీస్ సిబ్బంది, యువకులు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.