కాసిపేట, ఆగస్టు 8 : దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ మరో అరుదైన అవార్డును సొంతం చేసుకున్నది. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం), మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఆధ్వర్యంలో బుధవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 2022-23 సంవత్సరానికి అత్యుత్తమ పనితీరు కనబరిచిన గనులకు 5 స్టార్ రేటింగ్ అ వార్డులు ప్రదానం చేశారు. దేశంలో ఎఫ్వై 2022-23లో 5 స్టార్ రేటింగ్‌ను పొందిన 68 గనులకు అవార్డులు ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 5 గనులు 5 స్టార్ రేటిం గ్ సాధించాయి. ఇందులో భాగంగా దేవాపూ ర్ సున్నపురాయి గని కూడా భాగస్వా మ్యం వహించి వరుసగా రెండేఉ్ల 5 స్టార్ రేటింగ్ సాధించింది. తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డిప్యూటీ జీ ఎం ఎన్ ఎల్లయ్య, దేవాపూర్ ఓరియంట్ సిమెం ట్ కంపెనీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్పీ సహారేలు ఈ అవార్డును అందుకున్నారు.