పాట్నాపూర్‌లో వైభవంగా 97వ జయంతి
పాల్గొన్న కలెక్టర్ రాహుల్‌రాజ్, అడిషనల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి
వేలాదిగా తరలివచ్చిన భక్తులు
జైనూర్, ఆగస్టు 30: సద్గురు ఫూలాజీబాబా సేవలు మరువలేనివని కుమ్రం భీం ఆసిఫాబాద్, అదిలాబాద్ జిల్లాల జడ్పీఅధ్యక్షులు కోవ లక్ష్మి, రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని పాట్నాపూర్‌లో పూలాజీబాబా 97వ జయంతిని సోమవారం నిర్వహించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్‌రాజ్, అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డితో కలిసి వారు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కోవ లక్ష్మి, రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ వ్యసనాలకు దూరంగా ఉంటు ఆధ్యాత్మికం వైపు జీవితాన్ని మళ్లీంచేందుకు ఫూలాజీబాబా ఎనలేని కృషిచేశారన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి జిల్లాతో పాటు సమీప రాష్ర్టాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. కమిటీ సభ్యులు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావ్, సిద్ధేశ్వర్ ఆలయ కమిటీ అధ్యక్షుడు ఇంగ్లె కేశవ్, ఇంగ్లె వామన్, ఎంపీపీ కుమ్ర తిరుమల, వైస్‌ఎంపీపీ చీర్లె లక్ష్మణ్, సర్పంచ్‌లు మడావి భీంరావ్, పార్వతీ లక్ష్మ ణ్, కేంద్రె బాలాజీ, నాయకులు మెస్రం అంబాజీ, జాడి రవీందర్, మారు, తదితరులు ఉన్నారు.