
ఖానాపూర్ రూరల్, నవంబర్ 29 : దీక్షా దివస్ సందర్భంగా పట్టణంలోని తెలంగాణ చౌ రస్తాలో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పాలాభిషేకం చేశారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. తెలంగాణ చరిత్ర, ప్రజల స్థితిగతులను మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ ఖలీల్, ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, మాజీ జడ్పీటీసీ రామునాయక్, కౌన్సిలర్లు కుర్మ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ అమంద శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజగంగన్న, పర్శాపు శ్రీనివాస్, పుప్పాల గజేందర్, కొక్కుల ప్రదీప్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పరి మి సురేశ్, నాయకులు జన్నారం శంకర్, ఎనుగందుల నారాయణ, ద్యావత్ రాజేశ్వర్, కేహెచ్ ఖాన్, షెడ్జిల్, మెహరాజ్, మనోజ్, మణికంఠ, శోభన్, ఫసియుల్లా హక్, మహేశ్ పాల్గొన్నారు.