అంతర్జాతీయ క్రీడా పోటీల్లో రాణించాలి
జాతీయ క్రీడా దినోత్సవంలో అధికారులు, నాయకులు
మంచిర్యాల ఏసీసీ, ఆగస్టు 29 : హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకొని అంతర్జాతీయ క్రీడా పోటీల్లో రాణించాలని యువతీ యువకులకు పలువురు అధికారులు, క్రీడా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని డీవైఎస్వో మైదానంలో మంచిర్యాల జిల్లా డీవైఎస్వో శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. బాస్కెట్ బాల్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, కబడ్డీ, బాక్సింగ్, అథ్లెటిక్స్ పోటీలను బాల బాలికలకు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, 29వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి చైతన్య, సత్యపాల్ లయన్స్‌క్లబ్, ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ రఘునాథ రెడ్డి, బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రమోహన్ గౌడ్, సెక్రటరీ సుకుమార్, హ్యాండ్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ రమేశ్, కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ రామచందర్, కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ దేవన్న, అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాములు, వివిధ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులున్నారు.
సీనియర్ పీఈటీలకు సన్మానం
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ లయన్స్ క్లబ్ ఆధర్యంలో ఆదివారం సీనియర్ పీఈటీలు నంద్యాల నవీన్ రెడ్డి, దేవేందర్ రెడ్డి (గుడిపేట బాలుర పాఠశాల), కే.రవీందర్(ట్రినిటీ స్కూల్ ) ను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైటెక్‌సిటీ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రావుల ప్రతాప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గజ్జెల్లి వెంకటయ్య, ఉపాధ్యక్షుడు ముడుపు రాంప్రకాశ్, కార్యదర్శి డీ.రాజేశంగౌడ్, జీఎల్టీ కో ఆర్డినేటర్ సీహెచ్.హనుమంతరావు, చీఫ్ కో ఆర్డినేటర్ జీ కృష్ణమూర్తి, లయన్ చట్లా రామయ్య, లయన్ వీ నరోత్తమ రావు పాల్గొన్నారు.
సైక్లింగ్తోనే ఆరోగ్యం
సైక్లింగ్తోనే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని సీఐలు జగదీశ్, ముష్కేరాజు పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీ ఏఎంసీ ఏరియా నుంచి కాంటా చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ప్రకాశ్ స్పోర్డ్స్ అండ్ గేమ్స్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ గుప్తా క్లబ్‌కు ఆరు సైకిళ్లను బహూకరించారు. క్లబ్ ఆధ్వర్యంలో సీఐలు, ఏడీఏ సురేఖ, భీమాగౌడ్, గత నెలలో మంచిర్యాల నుంచి వారణాసి వరకు మూడు వేల కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసిన పద్మా సందేశ్గుప్తాను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నీలి కృష్ణ, బెల్లంపల్లి మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు పాత భాస్కర్, జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు విద్యాసాగర్, కోదండ రామాలయం చైర్మన్ రేణికుంట్ల శ్రీనివాస్, మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి పెద్ది రాజేందర్, వివేకానంద వాకర్ అసోసియేషన్ సభ్యు లు వినయ్, మహేశ్ పాల్గొన్నారు. వీకే స్పోర్డ్స్ క్లబ్ ఏడో వార్షికోత్సవం పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవాన్ని బజార్ ఏరియా జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన జాతీయ, రాష్ట్ర, సీనియర్ క్రీడాకారులు రిటైర్డ్ సీబీసీఐడీ అడిషనల్ ఎస్పీ పులియాల రవికుమార్, తోట పోచన్న, శ్రీనివాస్, యాదండ్ల నర్సయ్య, మాదాసి గోపాల్, చిలుముల నర్సయ్య, పీడీ, పీఈటీలను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా చేపట్టిన ర్యాలీని వన్‌టౌన్ సీఐ ముష్కే రాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ బజార్ ఏరియా పాఠశాల నుంచి కాంటా చౌరస్తా వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ ఛైర్మన్ గుండారపు చక్రపాణి, అధ్యక్షుడు షేక్ షఫీ, కార్యదర్శి షేక్ రాజ్‌మహ్మద్, క్లబ్ సభ్యులు,చిన్నారులు, క్రీడాభిమానులున్నారు.
బెల్లంపల్లి సీవోఈలో జాతీయ క్రీడా దినోత్సవం
బెల్లంపల్లిరూరల్, ఆగస్టు 29: బెల్లంపల్లి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీవోఈ)లో ఆదివారం ఉపాధ్యాయులు జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ధ్యాన్‌చంద్ 116 వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీవోఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు మాట్లాడుతూ ఎన్నో అవరోధాలను అధిగమించి ధ్యాన్‌చంద్ హాకీ లో భారత జాతి గర్వించే క్రీడాకారుడిగా గుర్తింపు సాధించారన్నారు. ధ్యాన్‌చంద్ పుట్టిన రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. పిల్లలకు ఆసక్తి ఉన్న క్రీడల్లో ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం ఉత్తమ వీఎఫ్‌సీ కమాండర్లకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కోట రాజ్‌కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు శివకుమార్, వామన్, సీనియర్ ఉపాధ్యాయలు వరమని ప్రమోద్‌కుమార్, ఉత్తమ విలేజ్ ఫిట్నెస్ సెంటర్స్ నిర్వాహకులుగా ఎంపికైన విద్యార్థి కమాండర్ సీహెచ్ రక్షిత, పృథ్వి, ప్రీతమ్, సౌమ్య, సింధూజ, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.