డీవైజీఎం విజయభాస్కర్‌రెడ్డి
రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేత
శ్రీరాంపూర్, ఆగస్టు 29: రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడాలని శ్రీరాంపూర్ డీవైజీఎం విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. మేజర్ ధ్యాన్‌చందర్ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శ్రీరాంపూర్ విశ్వశాంతి హైస్కూల్లో జనరల్ మజ్దూర్ అసోసియేషన్ అధ్యక్షుడు సిద్దన సాగర్, ప్రధాన కార్యదర్శి ఆరుముల్ల రాజు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పలువురు యువ క్రీడాకారులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డీవైజీఎం మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చన్నారు. అనంతరం 50 మంది రక్తదాతలను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం ఎస్ఐ మంగీలాల్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. 12 మంది అవయవ దానం చేసేందుకు ముందుకురాగా సదాశయ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తికి అంగీకార పత్రం అందజేశారు. కార్యక్రమంలో డీవైజీఎం రమేశ్, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ చందూరి మహేందర్, వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, సభ్యులు రాధాకృష్ణ, స్నేహ ఫౌండేషన్ చైర్మన్ కేవీ ప్రతాప్, సికల్ సెల్ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి రంజిత్, ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాజీసైదా కార్యదర్శులు కిషన్‌రావు, సమ్మయ్య, నాయకులు అశోక్‌కుమార్, శివకుమార్, రామకృష్ణ, రవికుమార్ పాల్గొన్నారు.