
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
అర్లి టీలో 4.9 డిగ్రీల కనిష్ఠ స్థాయికి
ఆదిలాబాద్ ( నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఆసిఫాబాద్/నిర్మల్ అర్బన్, జనవరి 29 : రాష్ట్రంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి.ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం మూడు రోజుల నుంచి వరుసగా 7.6,5.7, 4.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. శనివారం ఆదిలాబాద్ జిల్లాలో సగటు 6.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, అర్లీ (టీ) లో 4.9 డిగ్రీలు నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీ యంగా పడిపోయాయి. కుమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ) లో 5.8 డిగ్రీలు, గిన్నెధరిలో 6 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో 6.3 డిగ్రీలు, పిప్పల్ధరిలో 6.3 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్‌జోన్ ప్రాంతంలో 6.9 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇగం పెడుతుండడంతో వణికిపో తు న్నారు. చలిగాలు లు వీస్తుండడంతో పగటిపూట సైతం ప్రజలు చలిమంటలు వేసుకుం టున్నారు. జిల్లాలో నాలుగు రోజుల కిందటి వరకు 10 నుంచి 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా మూడు రోజులుగా బాగా పడిపోయాయి. దీంతో చలి ప్రభావం బాగా పెరిగిం ది. ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. చలి ఎక్కువగా ఉండే జిల్లాలకు రెడ్ అలర్డ్ ప్రకటించింది. వాతావరణ శాఖ హెచ్చ రికలు జారీ చేసిన జిల్లాల్లో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలు ఉన్నాయి. రోజంతా చలికారణంగా ప్రజలు రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. స్వెట్టర్లు, మఫ్లర్లు, మంకీ క్యాప్‌లు ధరిస్తున్నారు. ఇళ్లల్లో రూం హీటర్లు వాడుతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో రోడ్లపై జన సంచారం కనిపించడం లేదు. గుట్టలు, అటవీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటున్నది. చలికారణంగా పలువురు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. చిన్నారులు, వృద్ధులపై చలిఎక్కువ ప్రభావం చూపుతున్నదని పేర్కొన్నారు. ప్రజలు తమ పనులను ఉదయం నుంచి 9 నుంచి సాయంత్రం 6 గంటల్లోపు పూర్తి చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.