
ఐటీడీఏ పీవో అంకిత్
నాగోబా జాతర ఏర్పాట్ల పరిశీలన
ఇంద్రవెల్లి, జనవరి 29 : భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలని ఐటీడీఏ పీవో అంకిత్ అన్నారు. ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్దన్‌తో కలిసి నాగోబా జాతర ఏర్పాట్లను శనివా రం వారు పరిశీలించారు. మర్రిచెట్లు, గోవాడ్, నా గోబా ఆలయ ప్రాంతంలో పర్యటించి ఆయా శా ఖల ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లపై ఆరాతీశారు. నాగోబాకు మహాపూజలు నిర్వహించే మెస్రం వంశీయులతో పాటు భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అవసరమున్న చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ప్రతిరోజూ పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాఘవేంద్రరావ్, ఐటీడీఏ ఏవో రాంబాబు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఐటీడీఏ ఈఈ భీంరావ్, డీఈ శివకుమార్, డీఎల్పీవో భిక్షాపతిగౌడ్, ఏఈ భానుకుమార్, సీఐ సైదారావ్, ఎస్ఐ నందిగామ నాగ్నాథ్, అధికారులు పాల్గొన్నారు.