
చనాకా కొరటాను సిక్తాపట్నాయక్,సదర్మాట్ను ముషారఫ్ అలీ ఫారూఖీ..
1న మంత్రి అల్లోల, సీఎంవో కార్యదర్శి పర్యటన నేపథ్యంలో రాక
పనులు, పరిహారం ఏర్పాట్లపై ఆరా
మామడ,జనవరి 29 : మండలంలోని పొన్కల్ గోదావరిపై నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజీని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ శనివారం పరిశీలించారు. ఫిబ్రవరి 1న సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ సదర్మాట్ పనులను పరిశీలించేందుకు రానున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ బ్యారేజీ పనులు, భూసేకరణ, పరిహారం చెల్లింపు వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. హెలీప్యాడ్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ రామారావు, ఎస్డీసీ స్రవంతి, తహసీల్దార్ కిరణ్మయి, ఎంపీడీవో మల్లేశం, ఎంపీవో కలీం, రైతుబంధు సమితి మం డల కన్వీనర్ కాలగిరి గంగారెడ్డి పాల్గొన్నారు.
చనాకా కొరటా బ్యారేజీని పరిశీలించిన సిక్తాపట్నాయక్..
జైనథ్, జనవరి 29 : తెలంగాణ సరిహద్దు లోయ ర్ పెన్‌గంగపై నిర్మిస్తున్న చనాకా కొరటా బ్యారేజీ పనులను ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. నిర్మాణం, వ్యయం, అంచనా, ఇప్పటి వరకు భూ సేకరణ, పంప్‌హౌస్‌లో పెం డింగ్ పనులు, బ్యారేజీలో నీట నిల్వ సామర్థ్ధ్యం, సాగు నీరు తదితర విషయాలను ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈఈ రవీందర్ బ్యారేజీ నిర్మాణం , భూ సేకరణ, ఆయకట్టు, ముంపు గ్రామాలు , నీటి ఎత్తిపోతలు వంటి వివరాలను కలెక్టర్‌కు వివరించారు. అనంతరం హెలీప్యాడ్ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. కా ర్యక్రమంలో ఎస్ఈ పీ రాము, అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, ఆర్డీవో రాజేశ్వర్, డీఎస్పీ వెంకటేశ్వరరావు, నీటి పారుదల ఇంజినీరింగ్ శాఖ అధికారులు, జైనథ్ తహసీల్దార్ మహేందర్, ఎంపీడీవో గజానంద్ పాల్గొన్నారు.