యువతకు బాసటగా నిలుస్తాం
నిరుద్యోగ యువతీ యువకులకు బాసటగా నిలుస్తామని ఎస్పీ సురేశ్‌కుమార్ అన్నారు. పోలీసులు మీ కోసంలో భాగంగా జిల్లా కేంద్రంలోని టాటియా గార్డెన్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 3 వేల మంది హాజరయ్యారు.
- ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్‌కుమార్
- జాబ్ మేళాకు విశేష స్పందన
- 3 వేల మంది హాజరు l815 మందికి ఉద్యోగాలు
ఆసిఫాబాద్, ఫిబ్రవరి26 : నిరుద్యోగ యువతీ యువకులకు బాసటగా నిలుస్తామని ఎస్పీ సురేశ్‌కుమార్ అన్నారు. పోలీసులు మీ కోసంలో భాగంగా జిల్లా కేంద్రంలోని టాటియా గార్డెన్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 3 వేల మంది హాజరయ్యారు. ఇందులో 815 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిరుద్యోగులకు ప్రైవేట్ రంగాల్లో ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
చదువుకున్న ప్రతి వ్యక్తీ నిరుద్యోగిగా మిగలకూడదనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, నైపుణ్యాలను మెగుపరుచుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం ఉద్యోగం పొందిన వారికి జా యినింగ్ లెటర్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డీఎస్పీలు సదయ్య,కరుణాకర్, ఎస్బీ సీఐ రాణా ప్రతాప్, డీసీఆర్బీ సీఐ రమేశ్, సీఐలు సతీశ్, శ్రీనివాస్, నాగరాజు, చిట్టిబాబు, సాదిక్ పాషా, శంకరయ్య, ఆర్ఐ లు పెద్దన్న, అంజన్న, కిరణ్‌కుమార్, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

