సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
సొంత ఖర్చులతో అంబులెన్స్ అందజేత
మురళీగూడ పంచాయతీ భవనం ప్రారంభం
హాజరైన అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డి
పెంచికల్పేట్ , ఆగస్టు 28 : గిరి గ్రామాలైన జిల్లెడ, మురళీగూడ, నందిగాం, కమ్మర్గాం, గుండెపల్లి అభివృద్ధికి కృషి చే స్తానని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డితో కలిసి అమెరికా చేతన ఫౌండేషన్ సౌజన్యంతో రూ. 6 లక్షలు, ఎమ్మెల్యే జీతం రూ. 5 లక్షలు మొత్తం రూ. 11 లక్షలతో కొనుగోలు చేసిన అంబులెన్స్‌ను మురళీగూడ స ర్పంచ్ పోర్తెటి ఈశ్వరికి శనివారం అందజేశారు. ఈ సందర్భం గా అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ ఇక్కడి రోడ్లు అ ధ్వానంగా ఉన్నాయని, దీనికితోడు సిగ్నల్ సమస్య ఉండడం బాధాకరమన్నారు. టవర్ ఏర్పాటుతో పాటు రోడ్ల నిర్మాణానికి కృషిచేస్తాని భరోసా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు రోజుల క్రితం అంబులెన్స్ గ్రామాలకు రాక గిరిజన బాలింత పడిన ఇబ్బంది కలచివేసిందన్నారు. దీంతో మూడు నెలల క్రితం అంబులెన్స్ ఇస్తానని ఇచ్చిన హా మీ మేరకు వెంటనే ఈరోజు అందించానని చెప్పారు. కరంట్, తాగునీటి సమస్యను పరిష్కరించామని, రోడ్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వం రూ. 22 కోట్లు మంజూరు చేసిందని, దానికి సంబంధించిన టెండర్ కూడా పూర్తయిందని అటవీశాఖ వారి అభ్యంతరాలతో పనులు కొనసాగడం లేదన్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి నాలుగు నెలల్లో పరిష్కరిస్తానని హామీనిచ్చారు. అంబులెన్స్ డ్రైవర్‌గా గిరిజన బిడ్డనే నియమించి ఏ డాది పాటు నిర్వహణ బాధ్యత తానే తీసుకుంటానని చె ప్పారు. అనంతరం మురళీగూడ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్‌కు పూల దండలతో, వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు శ్రీనివాస్, మధున య్య, రాజన్న, ఎంపీటీసీ శారద, రాజన్న, ఎంపీడీవో శ్రీనివా స్, ఎంపీవో గంగాసింగ్, టీఆర్ఎస్ మండల, యువజన అధ్యక్షుడు తిరుపతి, కొండయ్య, నాయకులు సముద్రాల రాజన్న, వెంకటి, శ్రీనివాస్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.