
ఇంద్రవెల్లి, జనవరి 28 : పవిత్ర గంగాజలంతో కెస్లాపూర్ మర్రిచెట్ల వద్దకు గురువారం రాత్రి చేరుకున్న మెస్రం వంశీయులు కుటుంబ సమేతంగా అక్కడే ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేసుకొని విశ్రాంతి పొందుతున్నారు. టేక్చెట్లపై గంగా జలం ఝరిని భద్రపరిచారు. శుక్రవారం సంప్రదాయ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవైద్యాలతో కూ డిన వెదురు బుట్టలవద్ద మహిళలు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేసి మొక్కుకున్నారు. రా త్రి 8 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో ఆ యా గ్రామాల నుంచి వచ్చిన మెస్రం వంశీయుల పటేళ్లు కెస్లాపూర్కు చేరుకున్నట్లు కొత్వాల్ మెస్రం తిరుపతి మర్రిచెట్ల వద్ద బసచేస్తున్న మెస్రం వంశీయులకు సమాచారం అందించారు. పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్తోపాటు ఆయా గ్రామా ల నుంచి కెస్లాపూర్కు వచ్చిన పటేళ్లను పర్ధాంజీ లు మెస్రం దాదారావ్, మెస్రం గణపతి, కొత్వాల్ మెస్రం తిరుపతితోపాటు మరికొందరు పటేళ్లను ఆహ్వానించారు. మర్రిచెట్లవద్ద పటేల్ గాదితోపా టు కటోడ, గాయికి, ప్రధాన్ గాదిలను ఏర్పాటు చేశారు. అక్కడ పటేళ్లు, పర్ధాంజీలు వేర్వేరుగా కూర్చొని కచేరీ నిర్వహించారు. 31న నాగోబాకు నిర్వహించే మహాపూజలతోపాటు సిరికొండ మండలంలో తయారు చేసిన మట్టికుండలను తీసుకురావడంతోపాటు పెద్దల పేరిట నిర్వహించే(కర్మకాండలు)తుమ్ కార్యక్రమం నిర్వహనపై చర్చించారు. మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్, చిన్నుపటేల్, బాదిరావ్పటేల్, లింబారావ్పటేల్, మెస్రం వంశీయులు కటోడ మెస్రం కోసురావ్, పర్ధాంజీ మెస్రం దాదారావ్, కోశరావ్, హనుమంత్రావ్, గణపతి, నాయికిలు ధర్ము, ఇస్రు తదితరులు పాల్గొన్నారు.