
ఆదిలాబాద్ రూరల్, జనవరి 28 : టీఆర్ఎస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్నతోనే సాధ్యమని ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్ అన్నారు. నూతన అధ్యక్షుడిగా ఎంపికైనందుకు జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఐటీడీఏ చైర్మన్ మాట్లాడుతూ కష్టపడే కార్యకర్తలకు టీఆర్ఎస్లో గుర్తింపు ఉంటుందని తెలిపారు. ప్రతి కార్యకర్త ఆయన అడుగుజాడల్లో నడిచి టీఆర్ఎస్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో జీవవైవిధ్య కమిటీ సభ్యుడు మర్సుకోల తిరుపతి పాల్గొన్నారు.
ఆదిలాబాద్ టౌన్, జనవరి 28 : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నను దూదేకుల సంఘం నాయకులు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కలీం, నాయకులు షేక్ రంజాన్, లతీఫ్, షేక్ మహ్మద్ రఫీ ఉన్నారు.
బేల, జనవరి 28 : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్నను సాంగిడి గ్రామస్తులు ఆదిలాబాద్లో కలిసి సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రాకేశ్ , పీఎసీఎస్ చైర్మన్ బాలచందర్, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.
తలమడుగు, జనవరి 28 : మండలంలోని రుయ్యాడి గ్రామస్తులు ఆదిలాబాద్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్నను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. ఇక్కడ సర్పంచ్ పుండ్రు పోతారెడ్డి, గోక భూమారెడ్డి, నిమ్మల సుదర్శన్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి ఉన్నారు.
ఎదులాపురం, జనవరి 28 : టీఎమ్మార్పీఎస్ నాయకులు జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్నను కలిసి శాలువాతో సన్మానించారు. టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్యాల మనోజ్, అధికారి ప్రతినిధి నక్క రాందాస్, కోశాధికారి ప్రసన్న కుమార్, మాతంగ్ శక్తి జిల్లా అధ్యక్షుడు జాదవ్ సాంబశివ్, మల్లేశ్, అనిల్ ఉన్నారు.