
డీఆర్డీవో విజయలక్ష్మి
డీఏవోతో కలిసి ఏఈవోలతో సమీక్ష
నిర్మల్ టౌన్, జనవరి 28 : జిల్లాలో జాతీయ గ్రా మీణ ఉపాధిహామీ నిధులతో నిర్మిస్తున్న పంట కల్లాలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి విజయలక్ష్మి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఏఈవోలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మార్చి 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు మంజూరైన కల్లాలు, నిర్మాణంలో ఉన్న, పూర్తయిన వాటి వివరాలను మండలాల వారీగా సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ త్వరగా వినియోగంలోకి వచ్చేలా చూడాలన్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్ మాట్లాడుతూ జి ల్లాలో యాసంగి పంటల వివరాలను పక్కాగా న మోదు చేయాలని సూచించారు. జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.
నర్సరీల పరిశీలన
కడెం, జనవరి 28: మండలంలోని రాణిగూడ, గంగాపూర్ పంచాయతీలను డీఆర్డీవో విజయలక్ష్మి శుక్రవారం పరిశీలించారు. సర్పంచ్‌లు మరింత బాధ్యతతో నర్సరీల నిర్వహణ చేపట్టాలని, పంచాయతీ సిబ్బందితో విధిగా నిర్వహణ పనులు చేయించాలని సూచించారు. కార్యక్రమం లో ఎంపీడీవో క్రాంతి, ఏపీవో జయదేవ్, సర్పంచ్‌లు శాంత, ఉర్వేత భీంబాయి, ఉన్నారు.