
నేరడిగొండ, జనవరి 28 : అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. మండలంలోని కుంటాల (బీ) గ్రామంలో వైకుంఠధామాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం కుంటాల (కే) గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేరడిగొండలో ఎంపీడీవో కార్యాలయంలో 21 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయం గా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండడం మన అదృష్టమన్నారు.అనతి కాలంలోనే రాష్ట్రం ఎన్నో అద్భుత విజయాలను సాధించిందని వెల్లడించారు. కుంటాల ( బీ), కుంటాల (కే) గ్రామాల ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు.
కుప్టి ప్రాజెక్టుతో సస్యశ్యామలం…
కుప్టి ప్రాజెక్టు కోసం టెండర్లు పిలవాలని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రస్తావనకు తేవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే బాపురావ్ అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో నాలుగు మండలాలు సస్యశ్యామలం అవుతాయని, కుంటాల జలపాతానికి నిరంతరం నీటి ప్రవాహం ఉండడంతో పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చెందతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్, జడ్పీటీసీ జాదవ్ అనిల్, ఎంపీపీ రాథోడ్ సజన్, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దావుల భోజన్న, మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, వైస్ ఎంపీపీ మహేందర్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తిత్రే నారాయణసింగ్, కుమారి పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేశ్, నాయకులు కుంట కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రశేఖర్‌యాదవ్, ఆత్రం భీంరావ్, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో అబ్దుల్సమద్, గిర్దావరి నాగోరావ్, సీనియర్ అసిస్టెంట్ మీరాబాయి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.