
ఎంపీ సోయం బాపురావ్,ఎమ్మెల్యే ఆత్రం సక్కు
కుమ్రంభీం విగ్రహావిష్కరణ
ఆకట్టుకున్న థింసా నృత్యాలు
నార్నూర్, డిసెంబర్ 26 : గిరిజనుల వికాసానికి స్ఫూర్తినిచ్చిన పోరాట యోధుడు ఆదివాసీ ముద్దుబిడ్డ కుమ్రం భీం అని ఎంపీ సోయం బాపురావ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కొనియాడారు. గాదిగూడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కుమ్రం భీం విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముందు గా సంప్రదాయ పూజలు చేసి జెండా ఎగురవేశారు. ఎంపీ సోయం బాపురావ్,ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్కు ఘన స్వాగతం పలికి సన్మానించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఆదివాసీలు సాంస్కృతిక నృ త్యాలతో ఆకట్టుకున్నారు. గిరిజనులు అన్ని రం గాల్లో రాణించాలన్నారు. ఏజెన్సీ చట్టాల పరిరక్షణకు తనవంతు కృషి చేస్తామన్నారు. జనవరి9న భద్రాచలంలో నిర్వహించే సభకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సాంస్కృతిక నృత్యాల్లో ప్రతిభ చూపిన కళాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సభ అధ్యక్షుడు మెస్రం జైవంత్‌రావ్, ఎంపీపీ ఆడా చంద్రకళ-రాజేశ్వర్, వైస్ ఎంపీపీ మర్షివనే యోగేశ్, భీం మనుమడు సోనేరావ్, తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్య దర్శి పుర్క బాపురావ్, తహసీల్దార్లు ఆర్కా మోతీరామ్, దుర్వా లక్ష్మణ్, ఎంపీడీవో రామేశ్వర్, ఆత్రం నాగోరావ్ పటేల్, రాయిసెంటర్ జిల్లా సార్మెడి మెస్రం దుర్గు పటేల్, నాయకులు మెస్రం శేఖర్‌బాబు, మడావి చంద్రహరి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఆయా సంఘాల నాయకులు,ఆదివాసీ పెద్దలు పాల్గొన్నారు.