ఎంపీపీ డుబ్బుల నానయ్య అధ్యక్షతన నిర్వహణ
హాజరుకాని పలు శాఖల అధికారులు
ఈజీఎస్ ఏపీవో,ఈసీలపై సర్పంచ్ల ఆగ్రహం
చింతలమానేపల్లి, ఆగస్టు 25 : మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ డుబ్బుల నానయ్య అధ్యక్షతన బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. ముందుగా మండల వ్యవసాయ అధికారి రాజేశ్ మాట్లాడుతూ 6,974 రైతులకు రైతు బంధు డబ్బులు రూ. 10 కోట్ల78 లక్షల అందించామన్నారు. ఇప్పటివరకు 4,308 మంది రైతుబీమాను రెన్యూవల్ చేశామని, ఈనెల 3 నాటికి కొత్త పట్టాపాసు పుస్తకాలు వచ్చిన వారు కూడా ఈనెల 30 లోగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. గూడెం గ్రామానికి ఆగ్రోస్ రైతుసేవా కే్రందం మంజూరైందని, వచ్చేనెల 5 వరకు పంటల నమోదు చేసుకోవచ్చన్నారు. అనంతరం విద్యుత్, వైద్య, విద్య శాఖ అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు. ఈజీఎస్ ఏపీవో నివేదికను చదువుతుండగా, రణ్వెల్లి సర్పంచ్ సోమేశ్‌తో పాటు పలువురు సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెగ్రిగేషన్ షెడ్, ప్రకృతి వనాలు పూర్తయి 3 నెలలు కావస్తున్నప్పటికీ ఆన్లైన్లో నమోదు చేయకపోవడం తగదన్నారు. రవీంద్రనగర్-2 గ్రామానికి చెందిన హరిదాస్ మండల్ అనే రైతు కల్లానికి రూ. 50వేల అంచనా ఉండగా, రూ. 10వేలు మాత్రమే రికార్డు చేయడం ఏంటని సర్పంచ్ సుశీల్ మండల్ ప్రశ్నించారు. ఉపాధిహామీ ఏపీవో రాజన్న, ఈసీ చందన్ ప్రకాశ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. అనంతరం ఎంపీపీ డుబ్బుల నాన య్య మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై సర్పంచ్‌లు, కార్యదర్శులతో పాటు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అర్హులందరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ డుబ్బుల శ్రీదేవి, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు నాజీం హుస్సేన్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు
సమన్వయంతో పని చేయాలి: ఎంపీపీ సుజాత
పెంచికల్పేట్, ఆగస్టు 25 : అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీపీ జాజిమొగ్గ సుజాత అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో బుధవారం మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలువురు సర్పంచ్‌లు సమావేశానికి హాజరుకాకపోవడం తగదన్నారు. తహసీల్దార్ అనంతరాజు తన నివేదికను చదువుతుండగా, జడ్పీటీసీ సరిత జోక్యం చేసుకొని మాట్లాడారు. ట్రాక్టర్ల యజమానులు రోజుకు ఒక డీడీ మాత్రమే తీస్తూ రాత్రి , ప గలు తేడా లేకుండా ఇసుకను తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్నారన్నారు. ఈ విషయమై చర్యలు తీసుకోకుంటే ఈనెల 29 న జరగనున్న జడ్పీ సమావేశంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అనంతరం ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు సర్పంచ్, కార్యదర్శితో కలిసి పారిశుధ్య కార్మికులు పాఠశాలల్లో శానిటైజేషన్ చేపట్టాలని, పిచ్చిమొక్కల తొలగింపు, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సముద్రాల సరిత, తహసీల్దార్ అనంతరాజు, ఎంపీటీసీ శారద, సర్పంచ్‌లు జాజిమొగ్గ శ్రీనివాస్, మధునయ్య, చంద్రమొగిలి, ఎంపీవో గంగాసింగ్, ఏడీఏ రాజుల నాయుడు, ఏపీవో సతీశ్, పశువైద్యాధికారి రాకేశ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ, హెచ్‌ఈవో కోటేశ్వర్రావు, విద్యుత్‌శాఖ ఏఈ బాలకృష పాల్గొన్నారు.