
బెజ్జూర్, నవంబర్ 23 : మండలంలో వన్యప్రాణుల గణన కొనసాగుతున్నది. సోమవారం నుంచి మాంసాహార జంతువుల సర్వే కొనసాగుతుండగా బుధవారం ముగియనున్నట్లు రేంజ్ అధికారి పుర్క దయాకర్ తెలిపారు. రేంజ్ పరిధిలో మొత్తం 15 బీట్ల్లో 15 టీంలు సర్వే చేస్తున్నాయి. ప్రతి టీంలో 3-4 మంది సిబ్బంది బీట్లో మూడు రోజుల పాటు మూడు ట్రయల్ పాత్లలో నడిచి వెళ్తూ జంతువులను పరిశీలిస్తున్నా రు. ఉదయం 6.30 నుంచి 10 గంటల వరకు సర్వేను పూర్తి చేస్తున్నారు. స్టార్టింగ్ పాయింట్ నుంచి లేటెస్టు వర్షన్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్న ఎం స్ట్రైప్ ఎకలాజికల్ ఆన్లైన్ యా ప్ను ఆన్ చేసి నడక ప్రారంభిస్తారు. ఒక్క ట్రయల్ పాత్ లో మొత్తం 5 కిలోమీటరు పొడవునా నడిచి వెళ్తూ సర్వే చేస్తున్నారు. మొత్తం మూడు రోజుల పాటు 45 ట్రయల్ పాత్లలో సర్వేను పూర్తి చేసి జంతువుల గణనను సేకరిస్తున్నారు. ఈ సర్వే నడకలోని కదలికలు ఎప్పటికప్పుడూ ఆన్లైన్ అవు తూ సర్వే వివరాలు నేరుగా ఉన్నతాధికారులకు అందుతాయి. ఇలా నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా అటవీ సిబ్బంధి వన్యప్రానుల (pu g marks) పాదముద్రలు, (Scate) మలం, నేలపై, చెట్లపై (Scrape and Rake marks) వన్యప్రానుల గీచిన గీతలు, మూత్రపు వాసనలను (sent mqrks) వెదజల్లిన వాటిని పరిశీలిస్తూ అవి ఏ వన్యప్రాణివో ఎన్ని ఉన్నాయో వెం టనే లెక్కిస్తున్నారు. వీటితో పాటు వన్యప్రాణుల అరుపులు (Okalization) వింటూ నోట్ చేసుకుంటారు. ట్రయల్ పాత్ లో జంతువుల పాద ముద్రలు స్పష్టంగా కనబడేలా ముందుగానే 4-5 పీఐపీ లను ఏర్పాటు చేసుకుంటారు. అదే విధంగా అటవీ ప్రాంతానికి సమీపంలోని ప్రజల నుంచి కూడా సమాచారం తీసుకొని గణన చేపడుతున్నట్లు రేంజ్ అధికారి తెలిపా రు. డీఆర్వోలు శీలానంద్, సవిత, ఎఫ్ఎస్వో ప్రసాద్ రావు, బీట్ అధికారులు, యానిమల్ ట్రాకర్స్ సిబ్బంది పాల్గొన్నారు.
26 నుంచి శాకాహార ప్రాణుల గణన..
మాంసాహార వన్య ప్రాణుల గణన నేటితో ముగియనుండగా శాకాహార ప్రాణుల గణన 26 నుంచి ప్రారంభించనున్నట్లు రేంజ్ అధికారి దయాకర్ తెలిపారు. శాకాహారుల గణన విధానం వేరుగా ఉంటుందని వాటికి కావాల్సిన విధానల కోసం సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందించామని ఆయన పేర్కొన్నారు.