
తలమడుగు, నవంబర్ 23: సైబర్ నేరగాళ్లు ఆశ చూపి మోసగిస్తారని సైబర్మెంటర్ శ్రీనివాస్ స్వామి అన్నారు. సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలీస్, విద్యాశాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. మండలంలోని సుంకిడి, తలమడుగు, కజ్జర్ల, ఖోడద్, కేజీబీవీ సాయిలింగి ఉన్నత పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సుంకిడి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో సైబర్ మెంటర్ శ్రీనివాస్ స్వామి, కానిస్టేబుల్ అర్చన పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు ప్రతిజ్ఞ నిర్వహించారు. ప్రతి పాఠశాలలో ఇద్దరు విద్యార్థులను అంబాసిడర్లుగా ఎంపిక చేశారు. కార్యక్రమంలో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, పోలీసులు పాల్గొన్నారు.
తాంసి, నవంబర్ 23 : మండలంలోని పొన్నారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాలపై పోలీసులు విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ వనిత మాట్లాడారు. లక్కీ లాటరీ, గిఫ్ట్‌ల పేరుతో నేరగాళ్లు అమాయకుల బ్యాంకు ఖాతా నంబర్లు, ఓటీపీలు అడుగుతూ ఆన్లైన్ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసే వారికి వివరాలు చెప్పవద్దన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రేఖ, కానిస్టేబుల్ రాజేందర్, ఉపాధ్యాయులు పల్లవి, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 23: ప్రస్తుతం మోసగాళ్లు సైబర్ నేరాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని, ప్రజలు విద్యార్థులు మరింత జాగ్రత్తగా ఉండాలని షీటీం ఇన్చార్జి లక్ష్మి అన్నారు. మండలంలోని చాంద (టీ) ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు మంగళవారం సైబర్ నేరాలు, షీటీంలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మహిళల భద్రత కోసమే షీటీంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతరం సైబర్ క్రైమ్ అంబాసిడర్లుగా 10వ తరగతి విద్యార్థులు అంజలి, శ్రీనివాస్‌ను ఎంపిక చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ భాస్కర్, హెచ్ఎం శశికళ పాల్గొన్నారు.