ఈజీఎస్ జిల్లా అధికారుల ఆదేశం
పలు గ్రామాల్లో రిజిష్టర్ల పరిశీలన
దండేపల్లి, ఆగస్టు 23: ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు, తదితర రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఎంజీఎన్ఆర్ఈజీఎస్ సీఎఫ్వో శ్రీనివాసులు ఆదేశించారు. దండేపల్లి మండలంలోని ముత్యంపేట జీపీని తనిఖీ చేశారు. రిజిష్టర్ల నిర్వహణ, వర్క్ఫైల్ నిర్వహణ, నేమ్బోర్డ్ నిర్వహణ, తదితర అంశాల రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీడీ సదానందం, ఏపీవో దుర్గాదాస్, సర్పంచ్ విఠల్, జీపీ కార్యదర్శి రాజహరీశ్, తదితరులు ఉన్నారు.
వేమనపల్లి మండలంలో..
వేమనపల్లి, ఆగస్టు 23 : మండలంలోని నీల్వాయి, క్యాతనపల్లి, ముల్కలపేట గ్రామాల్లో ఉపాధి హామీ రికార్డులను ఎంపీడీవో లక్ష్మీనారాయణ , జిల్లా అధికారి శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, త్వరలో రాష్ట్ర, కేంద్ర అధికారులు పరిశీలించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సత్య ప్రసాద్, సర్పంచ్ గాలి మధు, కార్యదర్శులు వెంకట్, జాఫర్, సురేశ్ పాల్గొన్నారు. ఐటం
పకడ్బందీగా నిర్వహించాలి
కోటపల్లి, ఆగస్టు 23 : ఉపాధి హామీ పనులకు సంబంధించిన రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని సీఆర్డీ డిప్యూటీ ఈఈ నాగభూషణం సూచించారు. కోటపల్లి మండలంలోని పారుపల్లి, నక్కలపల్లిలో ఉపాధిహామీ పనులను సంబంధించి రికార్డులను పరిశీలించారు. డంప్ యార్డు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. ఉపాధి హామీ పనుల వివరాలను రికార్డుల్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కల సంరక్షణపై దృష్టి పెట్టాలన్నారు. పనులను మండల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. పనులు జరిగిన చోట వివరాలతో ఉన్న బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కోటపల్లి ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కొలిపాక భాస్కర్, ఏపీవో వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శులు తాజొద్దీన్, శివకుమార్, టీఏలు సరిత, సంపత్ రెడ్డి పాల్గొన్నారు.
కాసిపేట మండలంలో..
కాసిపేట, ఆగస్టు 23 : మండలంలోని గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వహణకు సంబంధించి మామిడిగూడెం, చిన్న ధర్మారం, ముత్యంపల్లి గ్రామ పంచాయతీల్లో రికార్డులను ఎంపీడీవో ఎంఏ అలీం, డీఆర్డీవో కార్యాలయ హెచ్ఆర్ మేనేజర్ రమేశ్ తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీలోని 7 రిజిస్టర్ల నిర్వహణ, పనుల నిర్వహణతో పాటు పలు అంశాల రికార్డులను తనిఖీ చేశారు. దీంతో పాటు పల్లె ప్రకృతి వనాలను సైతం పరిశీలించారు. కార్యక్రమంలో ఆయా పంచాయతీల కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.