e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 27, 2022
Home ఆదిలాబాద్ ధరలు పెంచుడు..ఉద్యోగాలు ఊడగొట్టుడు..

ధరలు పెంచుడు..ఉద్యోగాలు ఊడగొట్టుడు..

ఆ పార్టీ నుంచి గెలిచి ఈటల ఏం చేస్తడు..?
నన్ను గెలిపిస్తే గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుత
హుజూరాబాద్‌కు మెడికల్‌ కాలేజీ తెస్త
నియోజకవర్గానికి 4 వేల ఇండ్లు కట్టిస్త
కారు గుర్తుకు ఓటేసి, అండగా నిలవండి
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌
వీణవంక మండలంలో విస్తృత ప్రచారం

వీణవంక, అక్టోబర్‌ 22 : అన్ని ధరలు పెంచుడు.. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టుడు.. ఇదే బీజేపీ మార్క్‌ పాలన. దేశంలో పేదోళ్లకు ఏదో చేస్తరని గెలిపిస్తే.. వాళ్లను దోచి పెద్దలకు పంచుతున్నరు.. ఇసోంటి పార్టీ నుంచి ఈటలను గెలిపిస్తే మన ప్రాంతానికి ఏం న్యాయం జేస్తడు. సీఎం కేసీఆర్‌ 4వేల డబుల్‌ బెడ్రూం ఇండ్లను మంజూరు చేస్తే.. ఏడేళ్లలో ఒక్కటన్నా కట్టియ్యలె. రాజకీయంగా పెంచి పెద్ద చేసిన కేసీఆర్‌పైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నడు. ప్రభుత్వ పథకాలను అడ్డుకునే కుట్ర చేస్తున్నడు. ఇగ ఆయనకు ఓటెందుకేయాలె. పేదరికంలో పెరిగినోన్ని.. పేదల కష్టాన్ని తెలిసినోన్ని.. ఈసారి నన్ను గెలిపిస్తే గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుత.. మెడికల్‌ కాలేజీ తేవడంతో పాటు డబుల్‌ బెడ్రూం ఇండ్లను కట్టిస్త. ఈ నెల 30న జరిగే ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి, అత్యధిక మెజార్టీనివ్వండి.

ధరలు పెంచుడు.. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టుడు.. బీజేపీ మార్క్‌ పాలన అని హుజూరాబాద్‌ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు. వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో టీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అనంతరం మల్లారెడ్డిపల్లి, నర్సింహులపల్లి, నర్సింగాపూర్‌, లస్మక్కపల్లి, వల్భాపూర్‌ గ్రామాల్లో మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి శుక్రవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలను దోచి, పెద్దలకు పంచే బీజేపీలో చేరిన ఈటల మనకేం న్యాయం చేస్తాడని ప్రజలను ప్రశ్నించారు. పేదరికంలో పెరిగినోన్ని.. పేదల కష్టాలు తెలిసినోన్ని.. తనను ఆశీర్వదిస్తే హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. గతంలో నియోజకవర్గానికి 4 వేల డబుల్‌ బెడ్రూం ఇండ్లను సీఎం కేసీఆర్‌ మంజూరు చేస్తే, గెలిపించిన పాపానికి ఒక్క ఇల్లు కూడా ఈటల కట్టియ్యలేదని మండిపడ్డారు. మిగతా మంత్రులు మాత్రం పేదలకు ఇండ్లు కట్టించి, గృహప్రవేశాలు కూడా చేయించారని పేర్కొన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆయనకు ఉంటే, హైదరాబాద్‌లో కట్టించిన మెడికల్‌ కాలేజీని హుజూరాబాద్‌లో కట్టించేవాడని పేర్కొన్నారు. రాజకీయంగా పెంచి పెద్ద చేసిన సీఎం కేసీఆర్‌పైనే కుట్రలు చేశాడని మండిపడ్డారు.

- Advertisement -

తండ్రిలాంటి కేసీఆర్‌నే బొందపెడుతా అని ఈటల మాట్లాడడం సమంజసమేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌పైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని విమర్శించారు. బీజేపీ నాయకులు దళితబంధు పథకం పైనా కుట్రలు చేస్తున్నారని, కులాలను రెచ్చగొడుతూ నాటకాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులకు సాయం చేయడం చేతకాదని, అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌ను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు ఇచ్చుడు దేవుడెరుగు.. ఉన్నవాటిని కూడా కేంద్రంలో ఉన్న ఆపార్టీ పీకేస్తున్నదని ధ్వజమెత్తారు. రైతును రాజును చేయాలని సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. నల్లచట్టాలు తెచ్చి రైతులను కార్లతో తొక్కించి చంపిన పార్టీగా బీజేపీ చరిత్రలో నిలిచిపోతుందని స్పష్టం చేశారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి, బీజేపీ నేతలకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. మల్లారెడ్డిపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, మానేరు పరీవాహక గ్రామాలు కోర్కల్‌, నర్సింహులపల్లెలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పర్యాటక క్షేత్రాలుగా చేస్తానని హామీ ఇచ్చారు. హుజూరాబాద్‌కు మెడికల్‌ కాలేజీ తేవడంతో పాటు ఇప్పటికే మంజూరైన డబుల్‌ బెడ్రూం ఇండ్లను వెంటనే పూర్తి చేయిస్తానని చెప్పుకొచ్చారు.

గెల్లుకు జననీరాజనం
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి స్థానికులు ఘనస్వాగతం పలికారు. డప్పుచప్పళ్లు, ఒగ్గుడోలు వాయిద్యాల మధ్య కళాకారులు నృత్యం చేస్తుండగా.. మహిళలు నెత్తిన బతుకమ్మలు.. బోనాలు ఎత్తుకొని మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అభిమానులు, కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. నర్సింగాపూర్‌ గ్రామంలో యువకులు బైక్‌ర్యాలీతో స్వాగతం పలికారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు గొంగడి కప్పి, గొర్రె పిల్లను బహూకరించి, పూలమాలతో సన్మానించారు. నర్సింహులపల్లి, నర్సింగాపూర్‌ గ్రామాల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. నర్సింహులపల్లిలో గ్యాస్‌ ధరలకు నిరసనగా గెల్లు శ్రీనివాస్‌ గ్యాస్‌ సిలిండర్‌ ఎత్తుకొని నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ బాలకిషన్‌రావు, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్‌రెడ్డి, సర్పంచ్‌లు పొదిల జ్యోతి-రమేశ్‌, అలుగువెళ్లి నీరజ, గంగాడి సౌజన్య-తిరుపతిరెడ్డి, దాసారపు సుజాత-లక్ష్మణ్‌, ఎంపీటీసీలు జడల పద్మలత-రమేశ్‌, ఎలవేన సవిత-మల్లయ్య, సంగ స్వరూప-సమ్మయ్య, జీడి దేవేందర్‌, నాయకులు సంది సమ్మిరెడ్డి, బొంగోని రాజయ్య, తాండ్ర శంకర్‌, మల్లేశ్‌, జీవన్‌కుమార్‌, అలుగువెల్లి కోమల్‌రెడ్డి, మర్రి స్వామి, గెల్లు మల్లయ్య, రవియాదవ్‌, వెంకటరాజమ్‌, మేకల సమ్మిరెడ్డి, మర్రి సంపత్‌, బొంగోని తిరుపతిగౌడ్‌, బొబ్బల సమ్మిరెడ్డి, పాకాల గోవిందరెడ్డి, గూటం సమ్మిరెడ్డి, వీరారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ధరలు పెంచినందుకు బుద్ధిరావాలె..
గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతున్న బీజేపీకి బుద్ధి రావాలంటే ఈ ఉప ఎన్నికలో ఆ పార్టీని ఓడించాలె. కేంద్రంలోని బీజేపీ వల్ల ప్రస్తుతం సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. నల్లధనాన్ని దేశానికి తెప్పిస్తమని మాటలు చెప్పి, ఇంతవరకు ఒక్క రూపాయన్నా ప్రజలకు లాభం చేయలేదు. పైగా ధరలు పెంచి పేదోళ్ల నుంచే దోచుకుంటున్నరు. రాష్ట్రంలో ప్రతి పేదోడికి సంక్షేమాన్ని అందించేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారు. రైతు బంధు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, రైతు బీమా ఇవే ఇందుకు నిదర్శనం. పేదలకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌కు మనమంతా అండగా నిలవాలె. ఆయన పంపిన గెల్లు సీనును అత్యధిక మెజార్టీతో గెలిపించాలె. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపాలె.
-వీణవంక మండలంలో మెదక్‌ ఎమ్యెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement