సోమవారం 08 మార్చి 2021
Adilabad - Dec 08, 2020 , 00:32:45

కల్లాల పనులు వేగవంతం చేయాలి

కల్లాల పనులు వేగవంతం చేయాలి

  • ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌
  • వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం

ఎదులాపురం : పంట కల్లాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సోమవారం వ్య వసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సం దర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 528 కల్లాలను గ్రౌండింగ్‌ చేసినట్లు చెప్పారు. మిగతా వాటి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. కల్లాలు నిర్మించుకునేలా రైతుల ను ప్రోత్సహించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా వ్యవసా య శాఖ అధికారి ఆశాకుమారి మాట్లాడుతూ.. ఈ ఏడాది వాన కాలంలో 5.72 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేశారని వెల్లడించారు. యాసంగిలో కూడా జిల్లాలో 70,917 ఎకరాల్లో వివిధ పంటలను ప్రతిపాదించగా, ఇప్పటి వరకు 63,204 ఎకరాల్లో సాగు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,37,591 మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్ము సుమారుగా రూ.264 కోట్లు జమ చేసినట్లు వివరించారు.

రైతు బీమా కింద 146 క్లెయిమ్‌లకు గాను 99 మందికి రూ.4.95 కోట్ల బీమా చెల్లించామన్నారు. మిగతావి కూడా త్వరలో చెల్లిస్తామని తెలిపారు. యాసంగికి అవసరమైన ఎరువులు కూడా నిల్వ ఉ న్నాయని వెల్లడించారు. ఇప్పటికే ఏఈవోలు పంటల వివరాలు నమోదు చేస్తున్నారని తెలిపారు. ఏడీఏలు వెంకటి, శివకుమార్‌, శ్రీధర్‌స్వామి, ఏఈవోలు రవికుమార్‌, అష్రఫ్‌ ఉన్నారు.

VIDEOS

logo