సోమవారం 06 ఏప్రిల్ 2020
Adilabad - Feb 07, 2020 , 01:04:16

గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించిన డీఎఫ్‌వో

గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించిన డీఎఫ్‌వో

ఆదిలాబాద్‌ రూరల్‌ : ఎంపీ సంతోష్‌ కుమార్‌ పిలుపులో భాగంగా గ్రీన్‌ ఇండియాచాలెంజ్‌ను ఆదిలాబాద్‌ డీఎఫ్‌వో ప్రభాకర్‌ స్వీకరించారు. గురువా రం మావల పార్కులో మొక్కలు నాటి నిర్మల్‌ డీఎఫ్‌ వో సుతాన్‌, హైదరాబాద్‌ జీఎస్‌టీ  అసిస్టెంట్‌ కమిషనర్‌ రాజేంద్ర కుమార్‌, నిజామాబాద్‌ సైన్స్‌ అధికా రి గంగాకిషన్‌కు చాలెంజ్‌ విసిరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ సంతోష్‌ కుమార్‌ పిలుపుతో దేశ వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం శ్రీకారం చుట్టుకుందన్నారు. అనేక మంది రాజకీయ నాయకులు, అధికారులు మొక్కలు నాటుతూ వాటిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన హరితహారంతో  కోట్లాది మొక్కలు నాటి సంరక్షిస్తున్నామన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్క నాటి పరిరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. భావిభారత పౌరులకు స్వచ్ఛమైనగాలిని అందించేందుకు ప్రతి ఒక్కరూ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగస్వాములు కావాలని కోరారు.


logo