గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Jan 22, 2020 , 00:29:47

చెక్‌డ్యాంలతో అన్నదాతకు మేలు

చెక్‌డ్యాంలతో అన్నదాతకు మేలు
ఇరిగేషన్‌ ఈఈ సుశీల్‌కుమార్‌


తాంసి : చెక్‌డ్యాంల నిర్మాణంతో అన్నదాతకు ఎంతో మేలు జరుగుతున్నదని నీటిపారుదల శాఖ ఈఈ సుశీల్‌కుమార్‌ అన్నారు. సాగు కోసం నీటిని నిల్వ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు.  భీంపూర్‌ మండలంలోని కరంజి(టి), ధనోర, కామట్‌వాడ, గుంజాల, కొజ్జన్‌గూడ, భీంపూర్‌లలో వాగులపై చెక్‌డ్యాంల నిర్మాణం కోసం మంగళవారం నీటి పారుదలశాఖ అధికారులతో కలిసి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఈ మాట్లాడుతూ చెక్‌డ్యాంలు నిర్మిస్తే భూగర్భ జల మట్టం పెరుగుతుందన్నారు.  సాగునీటికి మార్గం ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భీంపూర్‌ మండలంలోని పలు గ్రామాల్లో సర్వే చేశామని,  జిల్లాలోని అన్ని మండలాల్లో సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సర్వే నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. సాధ్యమైనంత వరకు జిల్లాలో నీటిని నిల్వ చేసేందుకు అవసరమైనన్ని చెక్‌డ్యాంల నిర్మాణం చేపడుతామన్నారు. ఈఈ వెంట నీటి పారుదల శాఖ డీఈ ప్రతాప్‌సింగ్‌, ఏఈ సాగర్‌, సర్పంచ్‌ గుర్ల నరేందర్‌ యాదవ్‌, ఎంపీటీసీ రెడ్డి రమేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఏనుగు అశోక్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
logo