
మామడ,జనవరి19 : రైతు బీమాతో బాధిత కుటుంబానికి ధీమా ఏర్పడుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మండలంలోని కొరిటికల్ గ్రామానికి చెంది న రైతు మోతె రాజేశ్వర్ ఇటీవల బోరిగాం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో మరణించాడు. ఆయన కుటుంబానికి రైతు బీమా పథకం కింద మంజూరైన రూ.5 లక్షల చెక్కును రాజేశ్వర్ భార్య లక్ష్మికి బుధవారం మంత్రి అందజేశారు. మామడ స ర్పంచ్ హన్మాగౌడ్, కొరిటికల్ ఎంపీటీసీ సౌజన్య, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు లిం గారెడ్డి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు రాంకిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్‌గౌడ్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ గంగారెడ్డి, నాయకులు భాస్కర్‌రావు, నల్ల లింగారెడ్డి, రమేశ్‌రెడ్డి, రఘు, రాజేశ్వర్, అలీం, అశోక్, ఏఈవో సృజిత పాల్గొన్నారు.
ఆయిల్ మిల్ ప్రారంభం..
మండల కేంద్రంలో నూతనంగా ఏర్పా టు చేసిన నోయల్ ఆయిల్ మిల్‌ను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు దేవో ల్ల మధుకర్ మంత్రిని సన్మానించారు. వైస్ ఎంపీపీ లింగారెడ్డి, నవీన్, భూషణ్, శశికాంత్‌రెడ్డి, రవి, మహేశ్ పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు మంత్రి పరామర్శ
మండలంలోని దిమ్మదుర్తి సర్పంచ్ రెవెల్లి గీత ఇటీవల అనారోగ్యంతో మరణించారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బాధి త కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం సర్పంచ్ గీత చిత్రపటం వద్ద ని వాళులర్పించారు. పొన్కల్ గ్రామానికి చెం దిన రెడ్డి మహేశ్‌రెడ్డి, కొరిపెల్లి రాజారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించగా, వారి కు టుంబ సభ్యులనూ పరామర్శించారు. స ర్పంచ్ భూమేశ్వర్, ఉప సర్పంచ్ నరేశ్‌రెడ్డి, నవీన్‌రావు, భాస్కర్‌రావు, లింగారెడ్డి, గంగారెడ్డి, అశోక్ ఉన్నారు.
నిర్మల్ మండలంలో పలువురికి..
సోన్, జనవరి 19 : నిర్మల్ మండలంలోని పలువురు బాధిత కుటుంబసభ్యులను మంత్రి ఐకేరెడ్డి పరామర్శించారు. భాగ్యనగర్ మాజీ ఉప సర్పంచ్ రాంచందర్‌రెడ్డి ఇ టీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించా రు. అక్కాపూర్ గ్రామానికి చెందిన లక్కడి గంగారెడ్డి, వెంకటాపూర్ గ్రామానికి చెందిన సాయినాథ్‌రెడ్డి, చిట్యాల్ గ్రామానికి చెందిన చిన్నారెడ్డి ఇటీవల మృతి చెందారు. దీంతో వారి కుటుంసభ్యులను పరామర్శించారు. ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, చిట్యాల్ స ర్పంచ్ రమేశ్‌రెడ్డి, రాజారెడ్డి, నాయకులు రాంకిషన్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, పోశెట్టి ఉన్నారు.
మంత్రిని కలిసిన ఆలయ ఈవో
నిర్మల్ అర్బన్, జనవరి 19 : సారంగపూ ర్ మండలం అడెల్లి పోచమ్మ ఆలయ ఈ వోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అనూష మంత్రి ఐకే రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. పూల మొక్కను అందించారు. ఆలయ చైర్మన్ చందు ఉన్నారు.