
శిశు సంక్షేమ శాఖ తనిఖీ బృందం సభ్యులు నరేశ్, లోకేశ్‌రెడ్డి
కెస్లాపూర్ అంగన్వాడీ కేంద్రం తనిఖీ
ఇంద్రవెల్లి, నవంబర్ 17: అంగన్వాడీ కేంద్రం పరిధిలోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని శిశు సంక్షేమ శాఖ తనిఖీ బృందం సభ్యులు నరేశ్, లోకేశ్‌రెడ్డి, నీలేశ్ అంగన్వాడీ టీచర్లకు సూచించారు. మండలంలోని కెస్లాపూర్ అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం వారు తనిఖీ చేశారు. కేంద్రంలో నిలువ ఉన్న సరుకులతో పాటు పౌష్టికాహారాన్ని పరిశీలించారు. కేంద్రం ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రతి రోజూ పోషకాహారంతో పాటు వివిధ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాలతో పాటు మినీ కేంద్రాల్లో పార్కులు, కంపౌండ్ వాల్, మెడికల్ కిట్లు మంజూరు చేయించాలని సర్పంచ్ మెస్రం రేణుకానాగ్‌నాథ్ కోరారు. వారి వెంట మాజీసర్పంచ్ మెస్రం నాగ్నాథ్, పంచాయతీ కార్యదర్శి రఘు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు అనిత, మంగమ్మ, అంగన్వాడీ టీచర్లు కమలాబాయి, సుభద్ర ఉన్నారు.
జల్థా అంగన్వాడీ కేంద్రం తనిఖీ
ఇచ్చోడ, నవంబర్ 17: జల్థా అంగన్వాడీ కేంద్రాన్ని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇచ్చోడ సెక్టార్ గ్రేడ్ -1 సూపర్వైజర్ ఉమారాణి తనిఖీ చేశారు. కేంద్రానికి సంబంధించిన రికార్డులు పరిశీలించారు. చిన్నారుల ఎత్తు, కొలతలు తీసుకొని బరువును తూకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి బుధవారం పిల్లల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. అతి తీవ్ర పోషణతో ఉన్న పిల్లలను ఆదిలాబాద్ రిమ్స్‌లో ఉన్న ఎన్ఆర్సీకి పంపించాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
తాంసి, నవంబర్ 17: మండలంలోని పొన్నారి అంగన్వాడీ-2 కేంద్రాన్ని సూపర్వైజర్ విజయ తనిఖీ చేశారు. సరుకుల రికార్డులను పరిశీలించారు. గర్భిణులు, బాలింతలకు గుడ్లు పంపిణీ చేశారు. ఆమె వెంట ఎంపీటీసీ రేఖ, అంగన్వాడీ టీచర్లు దేవమ్మ, గంగమ్మ ఉన్నారు.
ఎస్ఏఎం సమావేశం నిర్వహించాలి
ఎదులాపురం, నవంబర్ 17 : ప్రతి బుధవారం ఎస్ఏఎం సమావేశం నిర్వహించాలని అర్బన్ సీడీపీవో వనజ అన్నారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్ అంగన్వాడీ కేంద్రం-1లో నిర్వహించిన సమావేశానికి ఆమె హాజరయ్యారు. పిల్లల బరువు, ఎత్తు, కొలతను పరిశీలించారు. తక్కువ బరువు ఉన్న పిల్లలకు డబుల్ రేషన్ ఇస్తున్నామని తెలిపారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ ఫరా, అంగన్వాడీ కార్యకర్త రాధ, గౌరిరాణి, విజయ, ఏఎన్ఎం తులసి పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, నవంబర్ 17: అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ ధనలక్ష్మి అన్నారు. మండలంలోని నర్సాపూర్(బీ), శ్యాంపూర్ సెక్టార్ పరిధిలోని చిన్నుగూడ, లక్షెట్టిపేట, ఉమ్రి, సాలేవాడ(బీ) అంగన్వాడీ కేంద్రాల్లో లెవెల్ మానిటరింగ్, సపోర్ట్ కమిటీ సమావేశాలు నిర్వహించారు. పిల్లల పోషణ స్థితిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు విజయ, శ్యాంరావు, విఠల్, అంగన్వాడీ టీచర్లు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.