
ఆదిలాబాద్ జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్
తాడిహత్నూర్‌లో వ్యాక్సినేషన్ కేంద్రం సందర్శన
నార్నూర్, నవంబర్ 17 : వ్యాక్సిన్ వేసుకోవ డంతో కరోనా వైరస్ దూరమవుతుందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొన్నారు. మండ లం లోని తాడిహత్నూర్ గ్రామంలో బుధవారం నిర్వ హించిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ వ్యాక్సి న్ వేసుకునేలా చూడాలని వైద్యాధికారులకు సూచించారు. వందశాతం పూర్తి చేయాల న్నారు. అనంతరం భీంపూర్‌లో బాల వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రాన్ని ప్రారంభించారు. బాల వికాస్ స్వచ్ఛం ద సంస్థ సేవలు మరువలేనివని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీని వాస్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాథో డ్ నరేం దర్, డివిజన్ పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్, నార్నూర్ సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి విజయ్‌కుమార్, జీవవైవిధ్య కమిటీ జిల్లా సభ్యు డు మర్సుకోల తిరుపతి, వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, సర్పంచ్ రాథోడ్ మధుకర్, ఉప సర్పంచ్ ఫఢ్ విష్ణు, పంచాయతీ కార్యదర్శి రాజశే ఖర్, నాయకులు, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.