
ఇచ్చోడ నుంచి నర్సాపూర్ వరకు అంతిమయాత్ర
నివాళులర్పించిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
ఇచ్చోడ, నవంబర్ 17: ఆర్మీ జవాన్ కేంద్ర సంజీ వ్ (32)కు బుధవారం మండల ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. నర్సాపూర్ గ్రామానికి చెందిన కేంద్రే ఊర్మిళ-వినాయక్‌రావ్ దంపతుల కుమారుడు సంజీవ్ దక్షిణాఫ్రికాలోని సూడాన్‌లో విధు లు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 9న గుండె పోటు తో మృతి చెందాడు. ఆయన పార్థ్థివ దేహాన్ని సైనిక విమానంలో మంగళవారం ఢిల్లీకి తీసుకువచ్చి, అ క్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ప్రత్యేక వాహనంలో మంగళవారం రాత్రి ఇచ్చోడకు తీసుకువచ్చి, స్థానిక ప్రభుత్వ దవాఖానలో ఉంచారు. కాగా, బుధవారం ఉదయం 7 గంటల నుంచి 12 వరకు ఇచ్చోడ మండల కేంద్రం మీదుగా నర్సాపూర్ వరకు అంతిమ యాత్రను ని ర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పూలు చల్లుతూ అంతిమ వీడ్కోలు పలికారు. నర్సాపూర్‌లోని జడ్పీ పాఠశాల సమీపంలోని ఖనన స్థలం లో పోలీసులు గౌరవ వందనం సమర్పించి, గా ల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. తల్లిదండ్రు లు, భార్య రోదించిన తీరు అందరినీ కంటతడి పె ట్టించింది. సంతాప సూచకంగా ప్రైవేట్ పాఠశాల లు, వ్యాపార దుకాణాలు స్వచ్ఛందంగా మూసి ఉంచి, అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
నివాళులర్పించిన ఎమ్మెల్యే
ఆర్మీ జవాన్ కేంద్రే సంజీవ్ అందరి హృదయాల్లో నిలిచిపోతాడని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావ్ అన్నారు. జవాన్ అంతిమ యాత్రలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. పా ర్థ్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇచ్చోడ, గుడిహత్నూర్ టీఆర్ఎస్ మండల కన్వీనర్లు ఏనుగు కృష్ణారెడ్డి, కరాడ్ బ్రహ్మానందం, ఆ త్మ చైర్మన్ నరాల రవీందర్, దాసరి భాస్కర్, రా థోడ్ ప్రకాశ్, ప్రవీణ్, ముస్తాఫా ఉన్నారు.