
మంత్రి అల్లోల కృషితో ఆలయానికి మహర్దశ
రూ.1.25 కోట్లతో అభివృద్ధి పనులు
నేటి నుంచి దత్త జయంతి వేడుకలు
ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ నిర్వాహకులు
వేడుకలకు హాజరుకానున్న మంత్రి
వేలాదిగా తరలిరానున్న భక్తులు
నిర్మల్ అర్బన్, డిసెంబర్ 15 ;ఆహ్లాదం.. ఆధ్యాత్మిక కేంద్రంగా, అభినవ షిర్డీగా నిర్మల్లోని గండిరామన్న దత్త సాయి ఆలయం విరాజిల్లుతున్నది. మహిమాన్విత మైన ఈ ప్రదేశం నిత్యం దూపదీప నైవేద్యాలు, సాయినామ స్మరణలతో మారుమోగుతున్నది. నిత్యం వేల మంది భక్తులు నిర్మల్ కేంద్రంతో పాటు ఇతర పాంత్రాల నుంచి దత్తసాయి ఆల యాన్ని దర్శించుకొని తమ మొక్కులు చెల్లిం చుకుంటున్నారు.
నిత్యం అర్చనలు, అభిషేకాలు, హారతి, హోమం, భజనలు, సాయి పల్లకీ ఊరేగింపు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను సాయి దీక్షా సేవా సమితి, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిత్యం నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతీ గురువారం మహా అన్నదానం నిర్వహిస్తు న్నారు. దత్తసాయి సన్నిధిలో బాబా ప్రతిమతో పాటు భారీ రూపంలో ఉన్న శివుడి విగ్రహం భక్తు లకు కనువిందు చేస్తున్నాయి. బాబా ఆలయం ఎదురుగా ఉన్న గుట్టపై కంచు రాతిని వేరే రాయి తో కొట్టిన్నట్లయితే వివిధ శబ్దాలు వినిపిస్తుం టాయి. కొండపై వెలసిన శివాలయానికి వందల ఏళ్ల పురాతన చరిత్ర ఉంది. ఆలయం చుట్టూ భారీ చెట్లు, గుట్టలు ఉండడంతో ఇక్కడ ఎంతో ప్రశాంతత నెలకొందని భక్తులు చెబుతున్నారు.
షిర్డీ తరహాలో ఆలయ నిర్మాణం..
షిర్డీని తలపించేలా ఆలయాన్ని నిర్మించడంతో గండిరామన్న ఆలయాన్ని అభినవ షిర్డీగా పిలు స్తుంటారు. చుట్టూ పచ్చని చెట్ల మధ్య నిర్మించిన ఆలయం ప్రకృతి ఒడిలో ఉన్నట్లు కనిపిస్తున్నది. సాయిబాబా ఆలయం, దత్త సాయి ఆలయం, దూని మందిరం, ధ్యాన మందిరం, భారీ శివుడి విగ్రహం, అన్నం కలిపే సాయిబాబా విగ్రహం, పిల్లలు ఆటలాడుకునేందుకు స్థలం, మైనంతో తయారు చేసిన సాయిబాబా విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మైనం విగ్రహం చు ట్టూ పచ్చని గార్డెన్లో భక్తులు, సేదతీరేందుకు అనువుగా ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో జలపాతాలు, బెంచీలు ఏర్పాటు చేయడంతో భక్తుల తాకిడి పెరిగిపోతున్నది.
ఆలయ అభివృద్ధిపై మంత్రి ప్రత్యేక దృష్టి
దత్త సాయి ఆలయ అభివృద్ధ్దికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నారు. రూ.కోటి 25 లక్షల నిధులను మంజూ రు చేయించి ఆలయాన్ని షిర్డీ తరహాలో అభివృద్ధి పరుస్తున్నారు. ఇప్పటికే రూ.25 లక్షల నిధులతో ఆలయ ప్రహరీ నిర్మాణ పనులు పూర్తికాగా..రూ. కోటి నిధులతో వాహన షెడ్డు, కార్యాలయం, ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు చేపట్టారు. త్వరలో అభివృద్ధి పనులు పూర్తి కానుండడంతో ఆలయం మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది.
రూ.75 లక్షల సొంత నిధుల ఖర్చు
లక్కాడి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి జ్ఞాప కార్థం రూ.75 లక్షల సొంత నిధులతో ఆలయా న్ని అభివృద్ధి పర్చారు. ఆలయం ఎదురు గల ఖాళీ స్థలంలో దాదాపు 16 అడుగులతో కూడిన భారీ దక్షిణ ముఖ హన్మాన్ విగ్రహం, ఎదురుగా సాయి అఖండ నందదీప్ను ఏర్పాటు చేశారు. దీంతో ఆలయం మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ఇదే పరిసరాల్లో ఫౌంటేయిన్ను ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు సేదతీరడానికి మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేశారు.
నేటి నుంచి పూజలు..
గురువారం ఉదయం స్వామి వారికి పూజా కార్యక్రమాలతో దత్త జయంతి వేడుకలు ప్రారంభ మవుతాయి. సాయంత్రం 6 గం టలకు ఆలయ ఆవరణలో పల్లకీ ఊరేగింపు, శుక్రవారం సాయి బాబాకు మంగళస్నానం, అర్చన ఉదయం 10 గంటలకు నిర్మల్ పట్టణ ప్రధాన వీధుల గుండా పల్లకీ ఊరేగింపు, నూతన చావడి తో ప్రతిష్ఠించే సింహాసనం, సా యిపటం ఊరేగింపు నిర్వహిస్తా రు. శనివారం మంత్రి ఇంద్రక రణ్ రెడ్డిచే చావడి ప్రతి ష్ఠాపన ఉంటుంది. ఉదయం 5.30 నిమిషాలకు మంగళస్నానం, పాలాభిషేకం, అర్చన పూజ, హారతి అనంతరం అన్నదానం నిర్వ హించనున్నారు.