
నిర్మల్ అర్బన్, నవంబర్ 15 : జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ పోలీసుల గౌరవం మరింత పెంచేలా కృషిచేయాలని నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు అర్జీదారులు తమ ఫిర్యాదులను పరిష్కరించాలని ఎస్పీకి వినతి పత్రాలు అందజేశారు. ఫిర్యాదు దారులతో ఆప్యాయంగా పలుకరించి, ఓపిగ్గా వారి సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, పరిష్కరించాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు పోలీసులు స్నేహభావంతో మెలగాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు సాయం కావాలనుకునే వారు నేరుగా స్టేషన్‌కు వచ్చి నిర్భయంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, సంఘ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని దృష్టికి వచ్చినా 8333986939 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.
ఆరుగురు రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్ల రిపోర్ట్..
తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకున్న ఆరుగురు రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్లు జిల్లా కు వచ్చారు. గ్రేహౌండ్స్, ఐఎస్ డబ్ల్యూ, సీఎస్డ బ్ల్యూ, ట్రాఫిక్, పీటీవో వంటి విభాగాల్లో ఫీల్డ్ ట్రై నింగ్ పూర్తి చేసుకొని రిపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్పీ ప్రధాన కార్యాలయంలో ఇన్చార్జి ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను బహూకరించారు.